Sunday, April 28, 2024

Logo
Loading...
google-add

ఈడీ విచారణకు మహువా మరోసారి డుమ్మా

T Ramesh | 13:54 PM, Thu Mar 28, 2024

తృణమూల్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ మహువా మొయిత్రా ఈడీ విచారణకు డుమ్మాకొట్టారు. క్వాష్ ఫర్ క్వెరీ కేసులో భాగంగా ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై మహువాను విచారించేందుకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా ఉన్నందున విచారణకు హాజరుకాలేనని ఆమె దర్యాప్తు సంస్థకు తెలిపారు.

ప్రస్తుతం పశ్చిమబెంగాల్ లోని కృష్ణానగర్ లోక్‌సభ స్థానం నుంచి టీఎంసీ తరఫున ఆమె పోటీకి దిగారు. గతంలోనూ ఈడీ రెండు సార్లు తాఖీదులు జారీ చేసినప్పటికీ అధికారిక పనుల్లో బిజీగా ఉన్నందున విచారణకు రాలేనంటూ మహువా బదులిచ్చారు. మహువాతో పాటు దుబాయ్ కు చెందిన వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీలు నేడు(గురువారం) విచారణకు హాజరుకావాలనీ బుధవారం ఈడీ నోటీసులు జారీ చేసింది. ఫెమా -1999  నిబంధనల ప్రకారం మహువాను ప్రశ్నించి వాంగ్మూలాన్ని రికార్డు చేసేందుకు ఈడీ సిద్ధమైంది.

లోక్ పాల్ ఆదేశాల మేరకు  క్యాష్ ఫర్ క్వరీ కేసును  సీబీఐ కూడా విచారిస్తోంది. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా), 1999 నిబంధనల ప్రకారం ఈ కేసులో మొయిత్రాను ప్రశ్నించాలని ఏజెన్సీ కోరుతోంది.   ఇతరుల నుంచి లబ్ధిపొంది,   ప్రధాని నరేంద్ర మోదీ, అదానీ గ్రూపు లక్ష్యంగా ముహువా, పార్లమెంటులో ప్రశ్నలు అడిగినట్లు బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపించడంతో ఆమెను పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ విచారించింది. ఆరోపణలు నిజమని నిర్ధారిస్తూ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని స్పీకర్ కు సిఫార్సు చేసింది. దీంతో స్పీకర్, మహువా లోక్‌‌సభ సభ్యత్వాన్ని రద్దు చేశారు. ఈ నిర్ణయాన్ని ఆమె సుప్రీంకోర్టులో సవాలు చేశారు.

google-add
google-add
google-add

క్రైమ్ న్యూస్

ఆధ్యాత్మికం

google-add

ఆర్థికం

google-add
google-add