Friday, May 10, 2024

Logo
Loading...
google-add

IPL 2024 MATCH 4-RR VS LSG :  రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోర్, ఆదిలోనే లక్నోకు షాక్

T Ramesh | 18:06 PM, Sun Mar 24, 2024

ఐపీఎల్-2024 లో భాగంగా జరుగుతున్న నాల్గో మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జైపూర్ వేదికగా తలపడుతున్నాయి. రాజస్థాన్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని, నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 193 పరుగులు చేసింది.

కెప్టెన్ సంజు శాంసన్(82) అజేయంగా నిలిచాడు. పరాగ్ 29 బంతుల్లో 43 పరుగులు సాధించగా,  ధ్రువ్ జురెల్( 20), యశస్వి జైస్వాల్ (24), జోస్ బట్లర్(11) పరుగులు చేశాడు.

లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో నవీనుల్ హక్ రెండు వికెట్లు తీయగా, మొహిసిన్ ఖాన్ , రవి బిష్ణోయ్ చెరోక వికెట్ తీశారు.

లక్ష్య ఛేదనలో భాగంగా బ్యాటింగ్ కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. నాలుగు పరుగుల వద్ద తొలి వికెట్ నష్టపోయింది.  ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్ లో క్వింటన్ డికాక్ (4) క్యాచ్ ఔట్ గా వెనుదిరిగాడు. దీంతో క్రీజులోకి వచ్చిన దేవదత్ పడిక్కల్ కూడా ట్రెంట్ బౌలింగ్ లోనే డకౌట్ గా పెవిలియన్ చేరారు. దీంతో మూడు ఓవర్లకు లక్నో జట్టు రెండు వికెట్లు నష్టపోయి 11 పరుగులు చేసింది.

google-add
google-add
google-add

క్రైమ్ న్యూస్

ఆధ్యాత్మికం

google-add

ఆర్థికం

google-add
google-add