Friday, May 10, 2024

Logo
Loading...
google-add

హిమాలయాల్లో పెరుగుతున్న సరస్సుల విస్తీర్ణం

T Ramesh | 10:56 AM, Tue Apr 23, 2024

భూతాపం కారణంగా హిమాలయాల్లో మంచు పర్వతాలు కరిగి సరస్సులుగా మారుతుండటంపై ఇస్రో కీలక సమాచారాన్ని వెల్లడించింది. 2016-17లో గుర్తించిన 2,431 సరస్సులు 89 శాతం పెద్ద ఎత్తున విస్తరించాయని నివేదికలో పేర్కొంది. సరస్సుల పరిమాణం గడిచిన 38 ఏళ్ళలో రెట్టింపు అయినట్లు తెలిపింది.

భూ వాతావరణం వేడెక్కటంతో పాటు భౌగోళిక మార్పులు కారణంగా  హిమనీనదాలు కరిగిపోతున్నాయి. దీంతో కొత్తగా సరస్సులు ఏర్పడటంతో పాటు ఉన్న సరస్సులు విస్తరించి లోతట్టు ప్రాంతాల్ని వరదలు ముంచెత్తే ప్రమాదం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

1984- 2023 మధ్య కాలంలో  భారతీయ హిమాలయ నదీ పరివాహక ప్రాంతాలను ఉపగ్రహ చిత్రాల ద్వారా ఇస్రో విశ్లేషించింది. ఇస్రో, నదులు, సరస్సుల పరిమాణంలో గణనీయ మార్పులు వచ్చినట్టు తెలిపింది.

  • Trending Tag

  • No Trending Add This News
google-add
google-add
google-add

క్రైమ్ న్యూస్

ఆధ్యాత్మికం

google-add

ఆర్థికం

google-add
google-add