Friday, May 10, 2024

Logo
Loading...
google-add

భారీ నష్టాలు : రూ.5 లక్షల కోట్లు ఆవిరి

K Venkateswara Rao | 16:34 PM, Mon Apr 15, 2024

స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు స్టాక్ మార్కెట్ల పతనానికి దారితీశాయి. ముడిచమురు ధరలు భగ్గుమంటాయనే అంచనాలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. దీంతో స్టాక్ మార్కెట్లు నేలచూపులు చూశాయి. సెన్సెక్స్ ఒకే రోజు 845 పాయింట్లు కోల్పోయి73399 వద్ద ముగిసింది. నిఫ్టీ 246 పాయింట్ల నష్టంతో 22272 వద్ద స్థిరపడింది.



ఇవాళ ఉదయం ప్రారంభం నుంచే స్టాక్ మార్కెట్లు తీవ్ర నష్టాలను చవిచూశాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ 900 పాయింట్లు కోల్పోయింది. ముడిచమురు ధరలు కూడా భారీగా పెరిగాయి. బ్యారెల్ ముడిచమురు ధర 90 డాలర్లు దాటిపోయింది. సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 27 కంపెనీల షేర్లు నష్టాలను, 3 కంపెనీలు లాభాలను పొందాయి.నిఫ్టీ 50లో 44 షేర్లు నష్టాలతో, 6 షేర్లు లాభాలతో ముగిశాయి. ఇన్టెస్టర్ల సంపద ఒకే రోజు రూ.5 లక్షల కోట్లు ఆవిరైంది.

google-add
google-add
google-add

క్రైమ్ న్యూస్

ఆధ్యాత్మికం

google-add

ఆర్థికం

google-add
google-add