Friday, May 10, 2024

Logo
Loading...
google-add

‘మాల్యా మీ దేశం వస్తే మాకు అప్పగించండి’... ఫ్రాన్స్ తో భారత్  చర్చలు 

T Ramesh | 12:27 PM, Fri Apr 26, 2024

బ్యాంకుల్లో భారీ మొత్తంలో అప్పులు తీసుకుని తిరిగి చెల్లించకుండా విదేశాలకు చెక్కేసిన విజయ్ మాల్యాపై  కఠిన చర్యలకు కేంద్రప్రభుత్వం సిద్ధమైంది. ఐరోపాలో విజయ్ మాల్యా కదలికలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టిన కేంద్రం, భారత్‌-ఫ్రాన్స్‌ జాయింట్‌ వర్కింగ్‌ గ్రూప్‌ సమావేశంలో ఈ అంశంపై చర్చించింది. మాల్యా ఫ్రాన్స్ వస్తే తమకు బేషరతుగా అప్పగించాలని భారత్ కోరగా, షరతులతో అప్పగించే అంశాన్ని ఫ్రాన్స్ ప్రతిపాదించింది.

ఏప్రిల్ 15న జరిగిన ఈ భేటీలో భారత విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి కె.డి.దేవాల్‌, ఫ్రాన్స్‌ తరఫున ఓలివర్‌ కార్నో పాల్గొన్నారు. భారత ఇంటెలిజెన్స్‌, హోం డిపార్ట్‌మెంట్‌ అధికారులు కూడా ఈ సమావేశానికి  హాజరై మనీలాండరింగ్‌, ఉగ్ర ఫండింగ్‌ కేసులకు సంబంధించి పరస్పర సహకారంపై సమాలోచనలు చేశారు. భారత్ నుంచి పారిపోయిన విజయ్ మాల్యా ప్రస్తుతం యూకేలో నివాసం ఉంటున్నాడు. అతడు ఇతర ఆస్తులు కొనుగోలు చేసిన దేశాలకు వెళ్ళకుండా అడ్డుకోవాలని  భారత్‌ నిర్ణయించింది. ఇందులో భాగంగా నేరస్థుల అప్పగింత ఒప్పందాలున్న దేశాలతో కేంద్రప్రభుత్వం చర్చలు జరుపుతోంది.

 విజయ్‌ మాల్యా భారత్‌లో రూ.9వేల కోట్ల అప్పు ఎగవేసి, విదేశాలకు పారిపోయాడు. దీనిపై కేసు నమోదైంది. లిక్కర్‌ కింగ్‌ గా పేరుగాంచిన విజయ్ మాల్యా విదేశాల్లో భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు సీబీఐ తన ఛార్జిషీటులో పేర్కొంది. ఫ్రాన్స్‌లో 35 మిలియన్‌ యూరోలు వెచ్చించి స్థిరాస్తి కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది. ఈడీ అభ్యర్థన మేరకు  ఫ్రాన్స్‌ ప్రభుత్వం రూ.14 కోట్ల విలువైన మాల్యా ఆస్తులను ఇప్పటికే సీజ్‌ చేసింది.

google-add
google-add
google-add

క్రైమ్ న్యూస్

ఆధ్యాత్మికం

google-add

ఆర్థికం

google-add
google-add