Saturday, April 27, 2024

Logo
Loading...
google-add

ఆధార్‌ ఉచిత అప్‌డేట్‌ గడువు మరో మూడు నెలలు పొడిగింపు

P Phaneendra | 16:36 PM, Tue Mar 12, 2024

Aadhar free update deadline extended again

ఆధార్‌ వివరాలను ఉచితంగా అప్‌డేట్‌ చేసుకునేగడువును మరో మూడు నెలలు పొడిగించారు. ఆ మేరకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ)  ఒక ప్రకటన చేసింది. ఆధార్‌లో వివరాలను ఉచితంగా అప్‌డేట్‌ చేసుకోడానికి ఇచ్చిన గడువు మార్చి 14తో ముగియనుంది. ఆ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు యుఐడిఎఐ, సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేసింది.

గడువు పొడిగింపుతో, ఆధార్‌లో ఉచితంగా మార్పుచేర్పులు జూన్‌ 14 వరకు చేసుకోవచ్చు. కేంద్రం మొదట 2023 మార్చి15 వరకు ఉన్న గడువును డిసెంబరు 14 వరకు పొడిగించింది. తర్వాత 2024 మార్చి 14 వరకు పొడిగించింది. ఇప్పుడు మరోసారి గడువు తేదీని పొడిగించింది. ఆధార్‌ అప్‌డేట్‌ కోసం ప్రజల నుంచి విశేష స్పందన వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు యుఐడిఎఐ వెల్లడించింది. ఈ ఉచిత సేవలు ‘మై ఆధార్‌’ పోర్టల్‌ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాయి. 

ఆధార్‌ కార్డు తీసుకుని పదేళ్ళు పూర్తయిన వారు తమ భౌగోళిక వివరాలు అప్‌డేట్‌ చేయాలి. దానికోసం అధికారిక వెబ్‌సైట్‌లో తాజా గుర్తింపు కార్డు, చిరునామా వివరాలను పొందుపరచాలి. గుర్తింపు, చిరునామా ధ్రువీకరణ పత్రాలుగా రేషన్‌ కార్డు, ఓటర్‌ ఐడీ, కిసాన్‌ ఫొటో పాస్‌బుక్‌, పాస్‌పోర్ట్‌, స్కూల్ టీసీ, మార్క్‌షీట్‌, పాన్‌ కార్డ్, డ్రైవింగ్‌ లైసెన్స్‌ వంటివి ఉపయోగపడతాయి.

google-add
google-add
google-add

ముఖ్యాంశాలు

Badi Baat

google-add

అంతర్జాతీయం

google-add
google-add

రాజకీయం

google-add
google-add