Thursday, May 09, 2024

Logo
Loading...
google-add

ఓటు ప్రాధాన్యంపై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు

T Ramesh | 16:49 PM, Sat Apr 27, 2024

ఆంధ్రప్రదేశ్ లో ఓటింగ్ శాతాన్ని గణనీయంగా పెంచేందుకు ప్రతీ జిల్లాలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఓటరు అవగాహన కోసం  లెట్స్ ఓట్ సంస్థ, జిల్లా యంత్రాంగం సంయుక్తంగా 3కే వాక్ నిర్వహించారు.

మొదటిసారి ఓటు హక్కు పొందిన యువతకు పోలింగ్ ప్రక్రియపై అవగాహన కల్పించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రాధాన్యాన్ని వివరించారు. త్రీకే రన్ లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా, జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, జిల్లా ఎస్పీ తుషార్ డూడీ పాల్గొన్నారు.

రాష్ట్రంలో 18 నుంచి 19 సంవత్సరాలు వయస్సు ఉన్న యువ ఓటర్లు గత ఏడాది జాబితా ప్రకారం చాలా తక్కువుగా 2.5 లక్షలు మంది మాత్రమే ఉన్నారని సీఈవో ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు. జిల్లా యంత్రాంగాలు, స్వచ్ఛంద సేవా సంస్థల కృషితో ప్రస్తుతం యువ ఓటర్లు 10.3 లక్షలకు పైగా పెరిగారని వివరించారు. రాష్ట్రంలో గత ఎన్నికలో 79 శాతం ఓటింగ్ నమోదైందని, ఈ సారి 83 శాతానికి పెంచేలా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ప్రజాస్వామ్య పండుగను విజయవంతం చేయటానికి మే 13 న యవ ఓటర్లతో పాటు అర్హులైన ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.

పట్టణ ప్రాంతాల్లోను ఓటింగ్ శాతంను పెంచటానికి అనేక ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. మధ్యతరగతి, ఉన్నత మధ్యతరగతి వర్గాలకు చెందిన వారు ఓటు హక్కు వినియోగించుకునేలా వారు నివసిస్తున్న ప్రాంతాల్లోని వెల్పేర్ అసోసియేషన్ల ద్వారా అవగాహన కల్పిస్తున్నామన్నారు. కార్మికులు ఓటు హక్కు వినియోగించుకునేలా ఓటింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు ప్రకటించటం జరిగిందన్నారు.

google-add
google-add
google-add

ముఖ్యాంశాలు

Badi Baat

google-add

వీడియోలు

తేజస్‌లో మోదీ

P Phaneendra | 15:40 PM, Sat Nov 25, 2023
google-add
google-add