Saturday, May 04, 2024

Logo
Loading...
google-add

తూర్పుతీరంలో పశ్చిమకోటలో పాగా వేసేదెవరు?

P Phaneendra | 21:13 PM, Tue Apr 23, 2024

Visakhapatnam West Assembly Constituency Profile

విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం 2008లో ఏర్పడింది. ఈ నియోజకవర్గంలో విశాఖపట్నం అర్బన్ మండలం పరిధిలోని, విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్‌కు చెందిన 16 మండలాలు ఉన్నాయి.

2009లో ఈ నియోజకవర్గం ఏర్పడినప్పుడు కాంగ్రెస్ అభ్యర్ధి మళ్ళ విజయప్రసాద్ విజయం కైవసం చేసుకున్నారు. ఆయన తన సమీప ప్రత్యర్థి ప్రజారాజ్యం పార్టీకి చెందిన పెతకంశెట్టి గణవెంకటరెడ్డినాయుడు అలియాస్ గణబాబు మీద గెలిచారు. తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల్లో గణబాబు తెలుగుదేశంలో చేరారు.

2014లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున పోటీచేసిన గణబాబు వైఎస్ఆర్‌సిపి అభ్యర్ధి దాడి రత్నాకర్ మీద గెలిచారు. 2019లో వైఎస్ఆర్‌సిపి అభ్యర్ధిగా మళ్ళ విజయప్రసాద్ పోటీ చేసారు. కానీ తెలుగుదేశం అభ్యర్ధి గణబాబే విజయం సొంతం చేసుకోగలిగారు.

రెండుసార్లు వరుసగా గెలిచిన గణబాబు 2024లో కూడా తెలుగుదేశం పార్టీ తరఫున బరిలోకి దిగారు. అధికార వైఎస్ఆర్‌సిపి ఈసారి ఆడారి ఆనంద్‌ను రంగంలోకి దింపింది. ఇక ఇండీ కూటమి తరఫున సిపిఐ అభ్యర్ధిగా అత్తిలి విమల పోటీ చేస్తున్నారు.

google-add
google-add
google-add

క్రైమ్ న్యూస్

ఆధ్యాత్మికం

google-add

ఆర్థికం

google-add
google-add

రాజకీయం

google-add
google-add