Saturday, May 04, 2024

Logo
Loading...
google-add

విశాఖ తూర్పున వెలగపూడి సెకెండ్ హ్యాట్రిక్ మొదలుపెట్టగలరా?

P Phaneendra | 17:41 PM, Tue Apr 23, 2024

Visakhapatnam East Assembly Constituency Profile

విశాఖపట్నం ఎంపీ సీటు వైఎస్‌ఆర్‌సిపికే వచ్చి ఉండవచ్చు గాక, కానీ 2019 ఎన్నికల్లో నగరంలోని శాసనసభా స్థానాల్లో తెలుగుదేశం హవాయే కనిపించింది. దాంతో ఈసారి ఎన్నికల ఫలితాలపై ఆసక్తి నెలకొంది.

విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం 2008లో ఏర్పాటయింది. అప్పటినుంచీ అక్కడ నిరాటంకంగా తెలుగుదేశమే గెలుస్తోంది. ఈసారి అక్కడ ఎలాగైనా పాగా వేయాలని అధికార వైఎస్ఆర్‌సిపి ప్రయత్నిస్తోంది. ఆ పార్టీకి కోస్తాంధ్రలో కొరకరాని కొయ్యలుగా ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో ఇదొకటి.

విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో విశాఖపట్నం అర్బన్ మండలంలోని కొన్ని భాగాలు, విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్‌లోని 16 వార్డులు ఉన్నాయి.

2009 రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున వెలగపూడి రామకృష్ణబాబు గెలిచారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ రెండోస్థానంలో నిలిచింది. కాంగ్రెస్ మూడోస్థానానికి పరిమితమయ్యింది. 2014లో తెలుగుదేశం, వైఎస్ఆర్‌సిపి ముఖాముఖి తలపడ్డాయి. అప్పుడు కూడా వెలగపూడి రామకృష్ణబాబు గెలిచారు. గతంలో ప్రజారాజ్యంలో ఉండి ఇప్పుడు వైఎస్ఆర్‌సిపి నాయకుడిగా ఎన్నికల పోటీలో నిలబడిన చెన్నుబోయిన శ్రీనివాసరావు ఓడిపోయారు.

2019లో కూడా తెలుగుదేశం ఈ స్థానాన్ని నిలబెట్టుకుంది. వెలగపూడి రామకృష్ణబాబుకు మెజారిటీ గతంతో పోలిస్తే గణనీయంగా తగ్గింది. వైఎస్ఆర్‌సిపి తరఫున ఆకారమణి విజయనిర్మల పోటీ చేసి ఓటమి మూటకట్టుకున్నారు.  

హ్యాట్రిక్ విజయాలతో ఊపుమీదున్న వెలగపూడి ఈ 2024 ఎన్నికల్లోనూ గెలిచి సెకండ్ హ్యాట్రిక్ మొదలు పెట్టాలని ధీమాగా ఉన్నారు. ఆయన ఎన్‌డిఎ తరఫున తెలుగుదేశం అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్న వైఎస్ఆర్‌సిపి ఇక్కడ ఎంవివి సత్యనారాయణను బరిలోకి దింపింది. ఇక ఇండీ కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్ధిగా గుత్తుల శ్రీనివాసరావు నిలబడ్డారు.

google-add
google-add
google-add

క్రైమ్ న్యూస్

ఆధ్యాత్మికం

google-add

ఆర్థికం

google-add
google-add