Sunday, May 05, 2024

Logo
Loading...
google-add

పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పరువు దక్కేనా?

P Phaneendra | 18:02 PM, Thu Apr 25, 2024

Pithapuram Assembly Constituency Profile

ప్రముఖ సినీనటుడు, జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో భీమవరం, గాజువాక రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి రెండుచోట్లా ఓటమిపాలయ్యారు. అంతేకాదు, ఆయన పార్టీ అభ్యర్ధులు ఒక్కరైనా గెలవలేదు. గెలిచిన ఒకే ఒక్క అభ్యర్ధి వైఎస్ఆర్‌సిపిలో టికెట్ దక్కని వ్యక్తి కావడంతో ఎన్నికల తర్వాత తిరిగి తన సొంతగూటికి వెళ్ళిపోయారు. ఆ నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ భవిష్యత్తు ఆసక్తికరంగా నిలిచింది.  ఆయన పిఠాపురం నుంచి పోటీచేయడంతో ఆ నియోజకవర్గంపై అందరి దృష్టీ పడింది.

పిఠాపురం నియోజకవర్గం 1951లో ఏర్పడింది. ఆ నియోజకవర్గం పరిధిలో మూడు మండలాలు ఉన్నాయి. అవి గొల్లప్రోలు, పిఠాపురం, కొత్తపల్లె.

పిఠాపురంలో ప్రజలు ఏ ఒక్కపార్టీకో విధేయులుగా ఉండిపోలేదు, అన్ని పార్టీలనూ ఆదరించారు. 1952లో సిపిఐ, 1955, 1960ల్లో ప్రజాపార్టీ గెలిచాయి. 1962, 1967, 1972, 1978లో కాంగ్రెస్ పార్టీ వరుసగా విజయాలు సాధించింది. 1983, 1985, 1994 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచింది. 1989లో కాంగ్రెస్ ఆఖరిసారి గెలిచింది. 1999లో స్వతంత్ర అభ్యర్ధి విజయం సాధించాడు. 2004లో భారతీయ జనతా పార్టీ గెలవడం విశేషమే. 2009లో ప్రజారాజ్యం తరఫున వంగా గీత గెలిచారు. 2014లో స్వతంత్ర అభ్యర్ధి ఎస్‌విఎస్‌ఎన్ వర్మ గెలిచారు. ఇక 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బోణీ చేసింది. ఆ పార్టీ తరఫున పెండెం దొరబాబు టిడిపికి చెందిన ఎస్విఎస్ఎన్ వర్మపై విజయం సాధించారు.

ఇక 2024లో అధికార వైఎస్ఆర్‌సిపి మరోసారి అభ్యర్ధిని మార్చింది, వంగా గీతను బరిలోకి దించింది. ప్రతిపక్ష ఎన్‌డిఎ కూటమి జనసేన అధిపితి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. వారిద్దరిలో ఎవరి బలం ఎంతో త్వరలో తేలిపోతుంది.

google-add
google-add
google-add

క్రైమ్ న్యూస్

ఆధ్యాత్మికం

google-add

ఆర్థికం

google-add
google-add