Saturday, May 04, 2024

Logo
Loading...
google-add

పెందుర్తి అసెంబ్లీలో పరిస్థితి ఏంటి?

P Phaneendra | 16:04 PM, Wed Apr 24, 2024

Pendurthi Assembly Constituency Profile

పెందుర్తి శాసనసభా నియోజకవర్గం ప్రత్యేకత ఏంటంటే ఈ స్థానం విశాఖపట్నం, అనకాపల్లి రెండు జిల్లాల్లోనూ వ్యాపించి ఉంది. ఈ నియోజకవర్గం 1978లో ఏర్పడింది. పెందుర్తి స్థానంలో నాలుగు మండలాలు ఉన్నాయి. అవి పెదగంట్యాడ, పరవాడ, సబ్బవరం, పెందుర్తి.

1978లో కాంగ్రెస్ గెలిచింది. 1980 ఉపయెన్నికలో కూడా ఆ పార్టీ నిలబడగలిగింది. 1983, 1985లో తెలుగుదేశం విజయం సాధించింది. 1989లో మళ్ళీ కాంగ్రెస్ గెలిచింది. 1994లో సిపిఐ, 1999లో తెలుగుదేశం, 2004లో కాంగ్రెస్, 2009లో ప్రజారాజ్యం పార్టీ గెలిచాయి.

2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి బండారు సత్యనారాయణ మూర్తి సమీప వైఎస్ఆర్‌సిపి అభ్యర్ధి గండి బాబ్జీ మీద విజయం సాధించారు. 2019లో వైఎస్ఆర్‌సిపి తమ అభ్యర్ధిని మార్చింది. ఆ వ్యూహం ఫలించింది. టిడిపి అభ్యర్ధి బండారు సత్యనారాయణమూర్తి మీద వైఎస్ఆర్‌సిపి అభ్యర్ధి అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ విజయం సాధించారు.

2024 ఎన్నికలకు వైఎస్ఆర్‌సిపి తమ సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌నే కొనసాగిస్తోంది. ఎన్‌డిఎ కూటమి తరఫున జనసేన అభ్యర్ధి పంచకర్ల రమేష్‌బాబు పోటీ చేస్తున్నారు. ఇక ఇండీ కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్ధి పిరిడి భగత్ బరిలోకి దిగుతున్నారు.

google-add
google-add
google-add

క్రైమ్ న్యూస్

ఆధ్యాత్మికం

google-add

ఆర్థికం

google-add
google-add

రాజకీయం

google-add
google-add