Sunday, May 05, 2024

Logo
Loading...
google-add

పెద్దాపురంలో పెద్దరికం చెలాయించేదెవరు?

P Phaneendra | 18:09 PM, Thu Apr 25, 2024

Peddapuram Assembly Constituency Profile

ఒకప్పుడు లలితకళలకు పేరుగడించిన జమీ పెద్దాపురం. రాచరికం పోయినా ఆ గాంభీర్యం ఇంకా నిలిచిఉన్న ఊరు పెద్దాపురం. అక్కడ శాసనసభా నియోజకవర్గం 1951లో ఏర్పడింది. ఈ నియోజకవర్గంలో రెండు మండలాలు ఉన్నాయి. అవి సామర్లకోట, పెద్దాపురం.

పెద్దాపురంలో 1952, 1962, 1972, 1978, 1989, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 1955, 1967లో సిపిఐ గెలిచింది. 1983, 1985, 1994, 1999, 2014, 2019 ఎన్నికల్లో తెలుగుదేశం విజయాలు దక్కించుకుంది. 2009లో ఒక్కసారి ప్రజారాజ్యం పార్టీ గెలిచింది.  

ఆసక్తికరమైన విషయం ఏంటంటే మిగతా పార్టీల్లో అభ్యర్ధులు ఎప్పటికప్పుడు మారితే టిడిపిలో రెండు వరుస ఎన్నికల్లో ఒకే అభ్యర్ధి గెలిచిన సందర్భాలు మూడున్నాయి. 1983, 1985లో బలుసు రామారావు గెలిచారు. 1994, 1999లో బొడ్డు భాస్కర రామారావు గెలిచారు. 2014, 2019లో నిమ్మకాయల చినరాజప్ప విజయం సాధించారు.

ఇప్పుడు 2024లో ఎన్‌డిఎ కూటమి నుంచి తెలుగుదేశం అభ్యర్ధిగా సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప హ్యాట్రిక్ లక్ష్యంతో బరిలోకి దిగుతున్నారు. గత మూడుసార్లుగా రెండో స్థానానికే పరిమితమైన వైఎస్ఆర్‌సిపి తరఫున దవులూరి దొరబాబు పోటీ చేస్తున్నారు. ఇండీ కూటమి నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా తుమ్మల దొరబాబు నిలబడ్డారు.

google-add
google-add
google-add

క్రైమ్ న్యూస్

ఆధ్యాత్మికం

google-add

ఆర్థికం

google-add
google-add