Tuesday, May 07, 2024

Logo
Loading...
google-add

ముమ్మిడివరంలో నిలబడాలని వైసీపీ, కలబడాలని టీడీపీ

P Phaneendra | 15:13 PM, Fri Apr 26, 2024

Mummidivaram Assembly Constituency Profile

ముమ్మిడివరం నియోజకవర్గం 1978లో ఏర్పడింది. అంతకుముందు చెయ్యేరు నియోజకవర్గం ఉండేది. అంతేకాదు. 1978 నుంచి 2004 వరకూ ముమ్మిడివరం ఎస్సీ నియోజకవర్గంగా ఉండేది. 2008 పునర్‌వ్యవస్థీకరణలో ఈ సీటు జనరల్‌గా మారింది.

ముమ్మిడివరం నియోజకవర్గంలో నాలుగు మండలాలున్నాయి. అవి ఐలాండ్ పోలవరం, ముమ్మిడివరం, తాళ్ళరేవు, కాట్రేనికోన.

మొదట్లో చెయ్యేరు నియోజకవర్గం ఉన్నప్పుడు 1955, 1962, 1978 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 1967లో మాత్రం స్వతంత్ర అభ్యర్ధి గెలిచారు. 1978లో ముమ్మిడివరం ఎస్సీ నియోజకవర్గం ఏర్పడినప్పుడు కూడా కాంగ్రెసే గెలిచింది. 1983, 1985ల్లో మాత్రం తెలుగుదేశం గెలిచింది. మళ్ళీ 1989, 1994 ఎన్నికల్లో కాంగ్రెస్ పుంజుకుంది. ఆ తర్వాత 1996, 1998, 1999 ఎన్నికల్లో తెలుగుదేశం జెండా ఎగిరింది. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు దక్కించుకుంది.

రాష్ట్ర విభజన తర్వాత మొదటి ఎన్నికలు జరిగిన 2014లో తెలుగుదేశం గెలిచింది. టిడిపి అభ్యర్ధి దాట్ల సుబ్బరాజు (బుచ్చిరాజు) వైఎస్ఆర్‌సిపి అభ్యర్ధి జివిఎస్ శ్రీనివాసరావు మీద విజయం సాధించారు. 2019లో పరిస్థితి తిరగబడింది. తెలుగుదేశం అభ్యర్ధి బుచ్చిరాజుని వైఎస్ఆర్‌సిపి కొత్త అభ్యర్ధి పొన్నాడ వెంకట సతీష్ ఓడించారు.

ఇప్పుడు 2024 ఎన్నికలకు ప్రధాన పార్టీలు రెండూ తమ పాత అభ్యర్ధులనే మోహరించాయి. వైఎస్‌ఆర్‌సిపి తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ బరిలోకి దిగారు. ఎన్‌డిఎ కూటమి తరఫున టిడిపి అభ్యర్ధిగా దాట్ల సుబ్బరాజు (బుచ్చిరాజు) పోటీ పడుతున్నారు. ఇక ఇండీ కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్ధిగా పాలేపు ధర్మారావు నిలబడ్డారు.

google-add
google-add
google-add

క్రైమ్ న్యూస్

ఆధ్యాత్మికం

google-add

ఆర్థికం

google-add
google-add