Sunday, May 05, 2024

Logo
Loading...
google-add

చోడవరంలో నాలుగోసారీ సన్యాసిరాజు వెర్సెస్ ధర్మశ్రీ

P Phaneendra | 15:46 PM, Wed Apr 24, 2024

Chodavaram Assembly Constituency Profile

అనకాపల్లి లోక్‌సభ పరిధిలో ఏడు శాసనసభా నియోజకవర్గాలున్నాయి. వాటిలో మొదటిది చోడవరం. అనకాపల్లి జిల్లాలోని ఈ అసెంబ్లీ స్థానంలో నాలుగు మండలాలున్నాయి. అవి చోడవరం, బుచ్చయ్యపేట, రావికమతం, రోలుగుంట. ఈ నియోజకవర్గం 1951లో ఏర్పడింది.

సాధారణంగా 50వ దశకంలో కాంగ్రెస్‌ ప్రాబల్యం ఎక్కువ ఉండే పద్ధతికి విరుద్ధంగా, ఈ నియోజకవర్గంలో ఆ పార్టీ పెద్దగా గెలవలేదు. 1952లో కృషికార్ లోక్‌పార్టీ, 1955లో స్వతంత్ర అభ్యర్ధి, 1967లో స్వతంత్ర పార్టీ, 1978లో జనతా పార్టీ గెలిచాయి. 1962లోనూ, 1972లోనూ మాత్రం కాంగ్రెస్ గెలిచింది. 1983, 1985ల్లో తెలుగుదేశం గెలిచింది. ఆ తర్వాత 1989, 1999లో గెలుపు తర్వాత కాంగ్రెస్‌కు ఈ సీటు దూరమైంది. 1994, 2004, 2009, 2014ల్లో తెలుగుదేశం విజయం సాధించింది. 2019లో వైఎస్‌ఆర్‌సిపి చోడవరాన్ని దక్కించుకుంది.

2009లో కాంగ్రెస్ తరఫున కరణం ధర్మశ్రీ పోటీ చేసారు. తెలుగుదేశం అభ్యర్ధి కెఎస్ నాగసన్యాసిరాజు చేతిలో ఓటమి పాలయ్యారు. 2014నాటికి ధర్మశ్రీ వైఎస్‌ఆర్‌సిపిలో చేరారు. కానీ ఆ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం తరఫున పోటీ చేసిన నాగసన్యాసిరాజుకే విజయం దక్కింది. 2019లో మాత్రం జగన్‌ వేవ్‌లో ధర్మశ్రీ గెలిచారు, నాగసన్యాసిరాజును ఓడించారు.

ఇప్పుడు 2024లో వైఎస్‌ఆర్‌సిపి సిట్టింగ్ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే నాగసన్యాసిరాజు నాలుగోసారి ముఖాముఖీ తలపడుతున్నారు. ఇండీ కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్ధిగా జగత్ శ్రీనివాస్ బరిలోకి దిగుతున్నారు.

google-add
google-add
google-add

క్రైమ్ న్యూస్

ఆధ్యాత్మికం

google-add

ఆర్థికం

google-add
google-add