Saturday, May 04, 2024

Logo
Loading...
google-add

లోక్‌సభలో మన స్థానాలు: అనకాపల్లి

P Phaneendra | 22:51 PM, Wed Apr 24, 2024

Anakapalli Parliamentary Constituency Profile

ఉత్తరాంధ్రలో బెల్లం పేరు చెబితే గుర్తొచ్చే పేరు అనకాపల్లి. ఆ ఊరు లోక్‌సభా నియోజకవర్గంగా 1962లో ఏర్పడింది. అనకాపల్లి పార్లమెంటరీ స్థానంలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. అవి చోడవరం, మాడుగుల, అనకాపల్లి, పెందుర్తి, ఎలమంచిలి, పాయకరావుపేట (ఎస్సీ), నర్సీపట్నం.

అనకాపల్లి ఎంపీ స్థానంలో ఆది నుంచీ కాంగ్రెస్ ఆధిక్యం బాగానే ఉంది. 1962 నుంచి 1980 వరకూ కాంగ్రెస్ విజయం సాధించింది. 1984లో ఒకసారి తెలుగుదేశం గెలిచినా 1989, 1991లో కాంగ్రెస్ తరఫున కొణతాల రామకృష్ణ గెలుపు దక్కించుకున్నారు. 1996లో టిడిపి, 1998లో కాంగ్రెస్ పంచుకున్నాయి. 1999, 2004లో టిడిపి గెలవగా 2009లో మళ్ళీ కాంగ్రెస్ పుంజుకుంది.

2009లో అనకాపల్లి ఎంపీ సీటు కోసం కాంగ్రెస్ నుంచి సబ్బం హరి, టిడిపి నుంచి ఎన్ సూర్యప్రకాశరావు పోటీ చేయగా, సబ్బం హరి విజయం సొంతం చేసుకున్నారు. 2014లో, అంటే రాష్ట్ర విభజన తర్వాత జరిగిన మొదటి ఎన్నికలో తెలుగుదేశం తరఫున పోటీ చేసిన ముత్తంశెట్టి శ్రీనివాసరావు అలియాస్ అవంతి శ్రీనివాస్, వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్ధి గుడివాడ అమరనాథ్‌ను ఓడించారు. 2019లో వైఎస్ఆర్‌సిపి అభ్యర్ధి భీశెట్టి వెంకట సత్యవతి తెలుగుదేశానికి చెందిన ఎ ఆనందబాబుపై ఘనవిజయం సాధించారు.

ఇప్పుడు 2024లో అనకాపల్లి పార్లమెంటరీ స్థానం నుంచి వైఎస్‌ఆర్‌సిపి బూడి ముత్యాలనాయుడును రంగంలోకి దింపింది. ఎన్‌డిఎ కూటమి నుంచి బిజెపి అభ్యర్ధిగా సిఎం రమేష్ పోటీ చేస్తున్నారు. ఇండీ కూటమి నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా వేగి వెంకటేష్ పోటీ పడుతున్నారు.

google-add
google-add
google-add

క్రైమ్ న్యూస్

ఆధ్యాత్మికం

google-add

ఆర్థికం

google-add
google-add