Sunday, April 28, 2024

Logo
Loading...
google-add

మహాశివరాత్రి సంబరాలు: ఆదిదంపతుల కళ్యాణంతో పరవశించిన శ్రీగిరి

T Ramesh | 10:46 AM, Sat Mar 09, 2024

జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠమైన శ్రీశైలంలో మహాశివరాత్రి సంబరాలు అంబరాన్ని అంటాయి. శుక్రవారం రాత్రి సంబరాల్లో  ప్రధాన ఘట్టమైన పాగాలంకరణ ఘట్టం క్రతువు నిర్వహించారు. లింగోద్భవ కాలంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు.

శ్రీశైలంలో జ్యోతిర్లింగంగా కొలువుదీరిన శ్రీ మల్లికార్జున స్వామిని వరుడిగా అలంకరించడమే పాగాలంకారం. ఈ పాగాను ప్రకాశం జిల్లా హస్తినాపురానికి చెందిన పృధ్వి వెంకటేశ్వర్లు కుమారుడు సుబ్బారావు నిర్వహించారు. స్వామివారి గర్భాలయం కలశం నుంచి నవనందులను కలుపుతూ ప్రత్యేకంగా అలంకరించారు. దిగంబరుడిగా పృద్ధి వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. . ఈ ఏడాది స్వామివారికి 31 తలపాగాలు కానుకగా పలువురు భక్తులు సమర్పించారు.

లింగోద్భవ సమయంలో 11 మంది వేద పండితులు, ప్రత్యేక అభిషేకాలు చేశారు. జగద్గురు శ్రీశ్రీశ్రీ చెన్నసిద్ధరామ పండితారాధ్యా శివాచార్య మహాస్వామి కూడా మల్లనకు ప్రత్యేక పూజలు చేశారు. లింగోద్భవం అనంతరరం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్లకు కళ్యాణం నిర్వహించారు. కనులపండువగా ఈ కార్యక్రమం జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ ఘట్టాన్ని వీక్షించి అనుగ్రహం పొందారు.

అనంతరం స్వామి అమ్మవార్లకు ప్రభోత్సవం శోభాయమానంగా నిర్వహించారు. గంగాధర మండపం నుంచి నందిమండపం వరకు ఈ ఊరేగింపు జరిగింది.  ప్రభోత్సవం తర్వాతం నంది వాహన సేవ నిర్వహించగా ఆది దంపతులు భక్తులను కటాక్షించారు.

google-add
google-add
google-add

ముఖ్యాంశాలు

Badi Baat

google-add

అంతర్జాతీయం

google-add
google-add