Friday, May 10, 2024

Logo
Loading...
google-add

IPL-2024: ఆర్సీబీపై సీఎస్కే విజయం, నేడు తొలి మ్యాచ్ ఆడనున్న సన్‌రైజర్స్ హైదరాబాద్

T Ramesh | 10:51 AM, Sat Mar 23, 2024

ఐపీఎల్- 2024 టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బోణీకొట్టింది. చెన్నై వేదికగా జరిగిన తొలి మ్యాచ్ లో ఆర్సీబీపై సీఎస్కే ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. 174 పరుగుల లక్ష్యాన్ని 8 బంతులు మిగిలిఉండగానే ఛేదించి విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టపోయి 173 పరుగులు చేసింది.

 బెంగళూరు టీమ్ 11.4 ఓవర్లు ముగిసే సమయానికి ఐదు వికెట్లు నష్టపోయి 78 పరుగులు చేసింది.  అయిత డీకే, అనుజ్ రావత్ చెలరేగడంత చివరి ఐదు ఓవర్లలో 71 పరుగులు రాబట్టారు. అనుజ్ రావత్ 25 బంతులు ఆడి 48 పరుగులు చేసి రనౌట్ కాగా, దినేశ్ కార్తీక్ 26 బంతుల్లో 38 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. విరాట్ కోహ్లీ(21). ఫాఫ్ డుప్లిసిస్( 35) ఫరవాలేదు అనిపించినా  రజత్ పాటిదార్(0), కామెరాన్ గ్రీన్( 18) నిరాశ పరిచారు. ముస్తాఫిజూర్, ఆర్సీబీ టాప్ ఆర్డర్ ను దెబ్బతీశాడు. గ్లెన్  మ్యాక్స్ వెల్ (0)ను చహర్ ఔట్ చేశాడు.

లక్ష్య ఛేదనలో చెన్నై టీమ్ ఎక్కడ తొణకలేదు. సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర తొలి వికెట్ కు 38 పరుగులు సాధించారు. అజింక్యా రహానే(27), డారిల్ మిచెల్(22), శివమ్ దూబే(34 నాటౌట్), రవీంద్ర జడేజా(25 నాటౌట్ ) రాణించారు. దీంతో చెన్నై సునాయసంగా విజయాన్ని అందుకుంది. రచిన్ రవీంద్ర 15 బంతుల్లో 37 పరుగులు సాధించాడు.

నేడు కోల్ కతా నైట్ రైడర్స్ , సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య  పోటీ

ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. పాట్ కమిన్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలో కోల్ కతా టీమ్ ఆడనుంది.

google-add
google-add
google-add

ఫోకస్

Asian Games Bharat @100: శత పతక భారతం

P Phaneendra | 10:13 AM, Sat Oct 07, 2023
google-add
google-add
google-add

భారతీయం

google-add
google-add