Friday, May 10, 2024

Logo
Loading...
google-add

ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌కి రాహుల్, జడేజా ఔట్

P Phaneendra | 18:00 PM, Mon Jan 29, 2024

KL Rahul and Ravindra Jadeja out of second test on England

ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సీరీస్‌లో మొదటి మ్యాచ్‌లో ఓడిపోయిన భారత జట్టుకు పెద్ద షాక్ తగిలింది. శుక్రవారం మొదలయ్యే రెండో టెస్ట్‌ మ్యాచ్‌కు కెఎల్ రాహుల్(KL Rahul), రవీంద్ర జడేజా (Ravindra Jadeja) అందుబాటులో ఉండరు. ఆ మేరకు బీసీసీఐ ఒక ప్రకటన (BCCI Statement) విడుదల చేసింది.

‘‘రవీంద్ర జడేజాకు మొదటి టెస్ట్‌లో నాలుగోరోజు గాయమైంది.ఇక రాహుల్‌ క్వాడ్రిసెప్స్ నొప్పితో బాధపడుతున్నాడు. అందువల్ల వారిద్దరూ ఫిబ్రవరి 2 నుంచి విశాఖపట్నంలో మొదలయ్యే టెస్ట్‌మ్యాచ్‌లో ఆడబోరు. వారిద్దరినీ బీసీసీఐ మెడికల్ టీమ్ పర్యవేక్షిస్తూ ఉంటుంది’’ అని ఆ ప్రకటనలో వెల్లడించారు.

రెండో టెస్ట్‌కు ఆడే జట్టులోకి సర్ఫరాజ్ ఖాన్ (Sarfraj Khan), సౌరభ్ కుమార్ (Saurabh Kumar), వాషింగ్టన్ సుందర్‌లను (Washington Sunder) తీసుకుంటున్నారని కూడా బీసీసీఐ తెలియజేసింది. పేసర్ అవేష్ ఖాన్ రంజీట్రోఫీ టీమ్‌లోనే కొనసాగుతాడనీ, అవసరమైతే టెస్ట్ జట్టులోకి అప్పటికప్పుడు తీసుకుంటామనీ వివరించింది.

ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌కు భారత జట్టు ఇదే: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్‌ గిల్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, కెఎస్ భరత్, ధ్రువ్ జ్యురెల్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కులదీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), అయేష్ ఖాన్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్

google-add
google-add
google-add

క్రికెట్

google-add
google-add
google-add