Friday, May 03, 2024

Logo
Loading...
google-add

ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడులకు దిగిన ఇరాన్

K Venkateswara Rao | 10:14 AM, Sat Apr 20, 2024

పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు చెలరేగాయి. శుక్రవారం తమ దేశంపై ఇజ్రాయెల్ దళాలు జరిపిన దాడికి ప్రతిగా ఇరాన్ డ్రోన్లతో విరుచుకుపడింది. గత శుక్రవారం ఇరాన్‌లోని ఇస్ఫహాన్‌నగరంలో ఇజ్రాయెల్ డ్రోన్లు, కాప్టర్లు, క్షిపణులతో దాడికి దిగింది. ఈ దాడిలో పెద్దగా నష్టం వాటిల్లలేదు. ఇజ్రాయెల్ దాడులపై ఇరాన్ స్పందించకపోయినా అమెరికా ధ్రువీకరించింది. ఇజ్రాయెల్ దాడులపై ఇరాన్ నోరు విప్పడం లేదు. సిరియాలో ఇరాన్ ఎంబసీలో ఇజ్రాయెల్ జరిపిన దాడిలో కీలక సైనిక కమాండర్లు చనిపోయిన తరవాత పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.



ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా ఇరాన్ కూడా డ్రోన్లతో దాడులకు దిగిందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. గమ గగనతలంలో అనుమానాస్పదంగా కనిపించిన వస్తువులను మాత్రమే కూల్చివేశామని ఇరాన్ చెబుతోంది. ఇజ్రాయెల్ దాడుల సమయంలో రాజధాని టెహ్రాన్ గగనతలాన్ని ఇరాన్ మూసి వేసింది. విమానాల రాకపోకలు నిలిపివేశారు. ఇజ్రాయెల్ దాడికి దిగినట్లు అధికారికంగా ప్రకటించకపోయినా, మూడు డ్రోన్లు కూల్చేసినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది.

google-add
google-add
google-add

ముఖ్యాంశాలు

Badi Baat

google-add

అంతర్జాతీయం

google-add
google-add

రాజకీయం

google-add
google-add