Sunday, April 28, 2024

Logo
Loading...
google-add

ప్రపంచ కుబేరుడి కిరీటాన్ని కోల్పోయిన ఎలాన్ మస్క్, వరల్డ్ నెంబర్ 1 జెఫ్ బెజోస్

P Phaneendra | 11:38 AM, Tue Mar 05, 2024

Jeff Bezos replaces Elon Musk as World’s richest person

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో అగ్రస్థానాన్ని కోల్పోయారు. ఆయన స్థానాన్ని అమెజాన్ సంస్థ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ భర్తీ చేసారు.

టెస్లా కంపెనీ షేర్ల విలువ సోమవారం నాడు 7.2% పడిపోవడంతో, బ్లూంబెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో మస్క్ తన అగ్రస్థానాన్ని కోల్పోయారు. ప్రస్తుతం ఆయన సంపద 197.7 బిలియన్ డాలర్స్ ఉండగా, 200.3 బిలియన్ డాలర్ల సంపదతో జెఫ్ బెజోస్. మస్క్‌ను అధిగమించేసారు.

2021 తర్వాత బ్లూంబెర్గ్ సంపన్నుల జాబితాలో అగ్రస్థానంలో నిలవడం బెజోస్‌కు ఇదే తొలిసారి. ఒకప్పుడు ఇద్దరి సంపదల మధ్య అంతరం 142 బిలియన్ డాలర్లు ఉండేది. ఇప్పుడా తేడా బాగా తగ్గుతూ వస్తోంది.

షాంఘైలోని టెస్లా కర్మాగారం నుంచి ఎగుమతులు ఏడాదిలో కనిష్ఠ స్థాయికి పడిపోయాయన్న గణాంకాలతో టెస్లా షేర్లు భారీగా పతనమయ్యాయి. 

మరోవైపు కరోనా ప్రారంభం నుంచీ అమెజాన్ సంస్థ తన ఆన్‌లైన్ అమ్మకాల్లో గణనీయమైన అభివృద్ధి సాధిస్తూ వస్తోంది. బెజోస్ గతంలో 2017లో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌ను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచాడు.

google-add
google-add
google-add

ముఖ్యాంశాలు

Badi Baat

google-add

అంతర్జాతీయం

google-add
google-add