Sunday, May 05, 2024

Logo
Loading...
google-add

కాకినాడ సిటీలో కాజా తినేదెవరు, తినిపించేదెవరు?

P Phaneendra | 18:31 PM, Thu Apr 25, 2024

Kakinada City Assembly Constituency Profile

కాకినాడ కాజా పేరు తెలీని తెలుగువాడు ఉండడంటే అతిశయోక్తి కాదు. కాకినాడ సిటీ శాసనసభా నియోజకవర్గంలో గెలుపూ అంత సులువు కాదు.

ఈ స్థానం తొలుత కాకినాడ స్థానంగా ఉండేది. 2008 పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా కాకినాడ సిటీ శాసనసభా నియోజకవర్గం ఏర్పడింది. కాకినాడ అర్బన్ మండలంలోని 65 వార్డులు ఈ స్థానం పరిధిలో ఉన్నాయి.

1952, 1953 ఎన్నికల్లో ఇక్కడ సిపిఐ గెలిచింది. 1955, 1962 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 1967, 1972లో స్వతంత్ర అభ్యర్ధి గెలిచారు. 1978లోనూ ఆ తర్వాత 1989లోనూ, ఆపైన 2004లోనూ కాంగ్రెస్ అభ్యర్ధి గెలిచారు. 1983, 1985, 1994, 1999లో తెలుగుదేశం అభ్యర్ధి విజయం కైవసం చేసుకున్నారు.

2008లో కాకినాడ సిటీ నియోజకవర్గం ఏర్పడ్డాక 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి ద్వారపూండి చంద్రశేఖరరెడ్డి గెలిచింది. రాష్ట్ర విభజన తర్వాత ఆయన వైఎస్ఆర్‌సిపిలో చేరారు. ఆ తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున వనమాడి వెంకటేశ్వరరావు, ద్వారంపూడిపై గెలిచారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్‌సిపి నుంచి ద్వారంపూడి, టిడిపి అభ్యర్ధి వనమాడిపై విజయం సాధించారు.

ఇప్పుడు 2024లో అధికార వైఎస్ఆర్‌సిపి తమ సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డినే నిలబెట్టింది. ఎన్‌డిఎ కూటమి తరఫున తెలుగుదేశం అభ్యర్ధి వనమాడి వెంకటేశ్వరరావు బరిలోకి దిగారు. ఇండీ కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్ధిగా చెక్కా నూకరాజు పోటీ చేస్తున్నారు.

google-add
google-add
google-add

ముఖ్యాంశాలు

Badi Baat

google-add

అంతర్జాతీయం

google-add
google-add

రాజకీయం

google-add
google-add