Friday, May 03, 2024

Logo
Loading...
google-add

రంపచోడవరం ఎవరి పరం కానుంది?

P Phaneendra | 17:11 PM, Fri Apr 19, 2024

Rampachodavaram Assembly Constituency Profile

ఒకప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో భాగమైన రంపచోడవరం, జిల్లాల పునర్విభజన తర్వాత అల్లూరి సీతారామరాజు జిల్లాలో భాగమయింది. షెడ్యూల్డు తెగవారికి రిజర్వ్ అయిన ఈ నియోజకవర్గం ఇది. ఇందులో మారేడుమిల్లి, దేవీపట్నం, వై రామవరం, అడ్డతీగల, గంగవరం, రంపచోడవరం, రాజవొమ్మంగి. కూనవరం, చింతూరు, వరరామచంద్రాపురం, నెల్లిపాక అనే 11 మండలాలు ఉన్నాయి.

2008లో శాసనసభ నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణ సమయంలో రంపచోడవరం ప్రత్యేకమైన నియోజకవర్గంగా ఏర్పాటయింది. అప్పటినుంచీ అక్కడ మూడుసార్లు ఎన్నికలు జరిగాయి.

2009లో కాంగ్రెస్ అభ్యర్ధి కెకెవివివి సత్యనారాయణ రెడ్డి గెలిచారు. 2014లో వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్ధి వంతల రాజేశ్వరి, 2019లో వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్ధి నాగులాపల్లి ధనలక్ష్మి విజయం సాధించారు.

ఇప్పుడు 2024 ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్‌సిపి, సిట్టింగ్ ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మిని మరోసారి బరిలోకి దింపుతోంది. ఎన్‌డిఎ కూటమి తరఫున తెలుగుదేశం అభ్యర్ధి పుంతల రాజేశ్వరి పోటీ పడుతున్నారు. ఇండీ కూటమి తరఫున సిపిఎం అభ్యర్ధి లోతా రామారావు రంగంలో ఉన్నారు.  

google-add
google-add
google-add

Badi Baat

లేటెస్ట్ అప్‌డేట్

google-add

వీడియోలు

తేజస్‌లో మోదీ

P Phaneendra | 15:40 PM, Sat Nov 25, 2023
google-add
google-add