Wednesday, May 08, 2024

Logo
Loading...
google-add

పాత గన్నవరంలో కొత్త అభ్యర్ధుల పోరు

P Phaneendra | 16:20 PM, Fri Apr 26, 2024

P Gannavaram Assembly Constituency Profile

అమలాపురం జిల్లాలోని రిజర్వుడు నియోజకవర్గాల్లో పి(పాత) గన్నవరం ఒకటి. 2008లో ఏర్పడిన ఈ నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్ అయి ఉంది. ఈ స్థానం పరిధిలో నాలుగు మండలాలు ఉన్నాయి. పి గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లి మండలాలు పూర్తిగానూ మామిడికుదురు మండలంలో కొంతభాగమూ పి గన్నవరం నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి.

మొదట్లో నగరం పేరుతో శాసనసభా నియోజకవర్గం 1962 నుంచీ ఉండేది. అప్పుడు 1962, 1967, 1972, 1978 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధులు గెలిచారు. 1983, 1985లో తెలుగుదేశం గెలిచింది. 1989లో ఒకసారి కాంగ్రెస్ విజయం సాధించాక మళ్ళీ 1994లో టిడిపి గెలుపు దక్కించుకుంది. 1999లో వాజ్‌పేయీ వేవ్‌లో ఆంధ్రప్రాంతంలో బిజెపి అభ్యర్ధి మానేపల్లి అయ్యాజీవేమా విజయం సాధించారు. తర్వాత 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి పి రాజేశ్వరీదేవి గెలిచారు. 2009 నుంచీ పి గన్నవరం నియోజకవర్గం అమల్లోకి వచ్చింది.

2014లో రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్‌సిపి అభ్యర్ధి కె చిట్టిబాబు మీద తెలుగుదేశం అభ్యర్ధి పి నారాయణమూర్తి విజయం సాధించారు. 2019లో తెలుగుదేశం అభ్యర్ధి నేలపూడి స్టాలిన్ బాబు మీద వైఎస్ఆర్‌సిపి అభ్యర్ధి కొండేటి చిట్టిబాబు గెలుపొందారు.

ఇప్పుడు 2024లో ప్రధాన పార్టీలు మళ్ళీ కొత్త అభ్యర్ధులను బరిలోకి దించాయి. వైఎస్ఆర్‌సిపి తరఫున విప్పర్తి వేణుగోపాల్ పోటీ పడుతున్నారు. ఎన్‌డిఎ కూటమి నుంచి జనసేన పార్టీ అభ్యర్ధి గిడ్డి సత్యనారాయణ బరిలో నిలిచారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకు ఈసారి వైసీపీ అవకాశం కల్పించకపోవడంతో ఆయన పార్టీ మారారు. ఇండీ కూటమి నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు.

google-add
google-add
google-add

Badi Baat

లేటెస్ట్ అప్‌డేట్

ఆళ్లగడ్డ : ఎవరి అడ్డా

K Venkateswara Rao | 13:35 PM, Tue May 07, 2024
google-add

వీడియోలు

తేజస్‌లో మోదీ

P Phaneendra | 15:40 PM, Sat Nov 25, 2023
google-add
google-add