Tuesday, May 07, 2024

Logo
Loading...
google-add

కొత్తపేటలో పాతమొహాల మధ్యనే పోటీ

P Phaneendra | 17:36 PM, Fri Apr 26, 2024

Kothapeta Assembly Constituency Profile

కోనసీమ జిల్లాలోని కొత్తపేట శాసనసభా నియోజకవర్గం 1955లో ఏర్పడింది. ఆ నియోజకవర్గం పరిధిలో నాలుగు మండలాలు ఉన్నాయి. అవి రావులపాలెం, కొత్తపేట, ఆత్రేయపురం, ఆలమూరు.

కొత్తపేటలో ఎన్నికలు మొదలైన తొలినాళ్ళలో ఆ నియోజకవర్గం కాంగ్రెస్‌కు విధేయంగా ఉంటూ వచ్చింది. 1955, 1959 ఉపయెన్నిక, 1962, 1967, 1972 ఎన్నికల్లో కాంగ్రెసే విజయం సాధించింది. 1978లో జనతా పార్టీ గెలిచింది. 1983, 1985ల్లో తెలుగుదేశం గెలిచినా 1989లో మళ్ళీ కాంగ్రెస్ పుంజుకుంది. 1994, 1999 ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున బండారు సత్యానందరావు గెలుపు దక్కించుకున్నారు. 2004లో కాంగ్రెస్ అభ్యర్ధిగా చిర్ల జగ్గిరెడ్డి విజయం సాధించారు. బండారు సత్యానందరావు 2009లో ప్రజారాజ్యం తరఫున పోటీ చేసి గెలవగలిగారు. తర్వాత ఆయన మళ్ళీ సొంతగూటికి చేరుకున్నారు.

2014లోనూ, 2019లోనూ బండారు సత్యానందరావు తెలుగుదేశం తరఫున పోటీ చేసారు. ఆ రెండుసార్లూ వైఎస్ఆర్‌సిపి తరఫున చిర్ల జగ్గిరెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. ఇప్పుడు 2024లో కూడా వారిద్దరే మళ్ళీ అవే పార్టీల తరఫున తలపడుతున్నారు. ఇండీ కూటమి నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా రౌతు ఈశ్వరరావు బరిలో ఉన్నారు.

google-add
google-add
google-add

Badi Baat

లేటెస్ట్ అప్‌డేట్

ఆళ్లగడ్డ : ఎవరి అడ్డా

K Venkateswara Rao | 13:35 PM, Tue May 07, 2024
google-add

వీడియోలు

తేజస్‌లో మోదీ

P Phaneendra | 15:40 PM, Sat Nov 25, 2023
google-add
google-add