Monday, April 29, 2024

Logo
Loading...
google-add

బెంగళూరు కేఫ్ కుట్రలో ప్రధాన కుట్రదారుడి అరెస్ట్

P Phaneendra | 11:04 AM, Fri Mar 29, 2024

Key Conspirator in Bangalore Café Blast Case Arrested

బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో పేలుడు ఘటనకు ప్రధాన కుట్రదారుణ్ణి జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ గురువారం అరెస్ట్ చేసింది. మూడు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో భారీస్థాయిలో సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ ఎట్టకేలకు కుట్రదారుణ్ణి పట్టుకోగలిగింది. మార్చి 1న జరిగిన పేలుడు ఘటనలో పలువురు కస్టమర్లు, హోటల్ సిబ్బంది గాయపడ్డారు.

ఎన్ఐఏ కర్ణాటకలో 12చోట్ల, తమిళనాడులో 5చోట్ల, ఉత్తరప్రదేశ్‌లో ఒకచోట సోదాలు నిర్వహించింది. ఆ క్రమంలోనే ముజామిల్ షరీఫ్‌ను అరెస్ట్ చేసింది. ఇప్పటికే గుర్తించిన ఇద్దరు నిందితులకు కుట్ర అమలులో సహకరించిన ప్రధాన సూత్రధారి ముజామిల్ షరీఫ్.

ఈ కుట్రలో ప్రధాన నిందితుడు, పేలుడుకు పాల్పడిన వ్యక్తి ముసావిర్ షాజీబ్ హుసేన్ అని ఎన్ఐఏ మొదట్లోనే గుర్తించింది. పలు ఇతర కేసుల్లో నిందితుడిగా ఉన్న అబ్దుల్ మతీన్ తాహాను మరో కుట్రదారుగా గుర్తించింది. వారిద్దరూ ఇంకా పట్టుబడలేదు. అబ్దుల్ మహీన్ తాహా 2020 నుంచీ పరారీలోనే ఉన్నాడు. ఇంక, రామేశ్వరం కేఫ్‌లో ఐఈడీ బాంబు పెట్టిన వ్యక్తి ముసావిర్ షాజీబ్ హుసేన్.

మార్చి 1న పేలుడు తర్వాత రామేశ్వరం కేఫ్ మార్చి 9 నుంచీ మళ్ళీ తెరచుకుంది. అక్కడ పటిష్ట భద్రతా ఏర్పాట్లు అమలవుతున్నాయి. కేఫ్ ద్వారం దగ్గర మెటల్ డిటెక్టర్లు అమర్చారు. కస్టమర్లను స్క్రీనింగ్ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు.

google-add
google-add
google-add

Badi Baat

లేటెస్ట్ అప్‌డేట్

google-add

వీడియోలు

తేజస్‌లో మోదీ

P Phaneendra | 15:40 PM, Sat Nov 25, 2023
google-add
google-add