Saturday, May 11, 2024

Logo
Loading...
google-add

కొవ్వూరు బరిలో గెలిచేదెవరు?

P Phaneendra | 23:01 PM, Sat Apr 27, 2024

Kovvuru Assembly Constituency Profile

కొవ్వూరు ఒకప్పుడు పశ్చిమగోదావరి జిల్లాలో ఉండేది. ఇటీవల జిల్లాల పునర్విభజన చేసాక తూర్పుగోదావరిలో చేరింది. కొవ్వూరు నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వు చేసిన స్థానం. ఈ నియోజకవర్గంలో మూడు మండలాలు ఉన్నాయి. అవి కొవ్వూరు, చాగల్లు, తాళ్ళపూడి.

కొవ్వూరు నియోజకవర్గం 1951లో ఏర్పడింది. అక్కడ 1952లో మొదటి ఎన్నికల్లో  సిపిఐ గెలిచింది. 1955, 1962, 1978 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 1967, 1972 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధులు గెలవగలిగారు.

కొవ్వూరు నియోజకవర్గాన్ని సాధారణంగా తెలుగుదేశం పార్టీ కంచుకోటగా భావిస్తారు. 1983లో పార్టీ ఏర్పాటు చేసిన నాటినుంచి 2014 వరకూ ఆ పార్టీయే గెలుస్తూ వచ్చింది. మధ్యలో 1999లో ఒక్కసారి కాంగ్రెస్ అభ్యర్ధి గెలిచారు. మొన్న 2019లో వైఎస్ఆర్‌సిపి అభ్యర్ధి తానేటి వనిత తెలుగుదేశం అభ్యర్ధి వంగలపూడి అనిత మీద విజయం సాధించారు.

ఇప్పుడు 2024లో అధికార వైఎస్ఆర్‌సిపి తరఫున తలారి వెంకట్రావు పోటీ చేస్తున్నారు. ఆయనపై పోటీకి ఎన్‌డిఎ కూటమి నుంచి టిడిపి అభ్యర్ధి ముప్పిడి వెంకటేశ్వరరావు నిలబడ్డారు. ఇక ఇండీ కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్ధిగా అరిగెల అరుణకుమారి తలపడుతున్నారు.

google-add
google-add
google-add

ముఖ్యాంశాలు

Badi Baat

google-add

వీడియోలు

తేజస్‌లో మోదీ

P Phaneendra | 15:40 PM, Sat Nov 25, 2023
google-add
google-add