Friday, May 10, 2024

Logo
Loading...
google-add

పింఛను నగదు పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు

T Ramesh | 13:03 PM, Sat Apr 27, 2024

సామాజిక పింఛను లబ్ధిదారులకు సకాలంలో నగదు అందేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున లబ్ధిదారులకు ఎలాంటి  ఇబ్బంది లేకుండా చూడాలని తెలిపింది. పింఛన్ సహా, నగదు బదిలీ పథకాలకు సంబంధించి మార్చి 30న జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని గుర్తు చేసింది.

ఈసీ మార్గదర్శకాలను వాస్తవిక దృష్టితో ఆలోచించి అమలు చేయాలని సీఎస్ జవహర్ రెడ్డికి తెలిపింది. పింఛన్ల పంపిణీకి శాశ్వత ఉద్యోగుల సేవలను మాత్రమే వినియోగించుకోవాలని తేల్చి చెప్పింది. ఇంటింటికీ పెన్షన్ల నగదు పంపిణీ చేసేందుకు వాలంటీర్లకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించుకోవాలని ఆదేశించింది.   గత నెలలో పింఛన్ల నగదు  పంపిణీ  సందర్భంగా అనుసరించిన తీరుపై ఫిర్యాదులు వచ్చాయని తెలిపింది.

google-add
google-add
google-add

ముఖ్యాంశాలు

Badi Baat

google-add

వీడియోలు

తేజస్‌లో మోదీ

P Phaneendra | 15:40 PM, Sat Nov 25, 2023
google-add
google-add