Friday, May 10, 2024

Logo
Loading...
google-add

రెండోదశ ఎన్నికల్లో 64.7శాతం పోలింగ్‌ నమోదు

P Phaneendra | 10:30 AM, Sat Apr 27, 2024

Around 65pc polling in second phase elections

శుక్రవారం ఏప్రిల్ 26న రెండోదశ ఎన్నికల్లో 88 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. 12 రాష్ట్రాలు 1 కేంద్రపాలిత ప్రాంతంలోని నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో 1200 మంది అభ్యర్ధుల జాతకం ఈవీఎంలలో నిక్షిప్తమైంది.

మొదటి దశలో 102 స్థానాలకు పోలింగ్ ఏప్రిల్ 19న జరిగింది. ఆ దశలో సుమారు 65.5శాతం పోలింగ్ నమోదయింది.

రెండోదశలో 64.7శాతం పోలింగ్ నమోదయింది. ఈ దశలో కేరళలోని మొత్తం 20 స్థానాలు, కర్ణాటకలోని మొత్తం 28లో 14 స్థానాలు, రాజస్థాన్‌లో 13 సీట్లు, మహారాష్ట్రలో 8 నియోజకవర్గాలు, ఉత్తరప్రదేశ్‌లో 8 నియోజకవర్గాలు, మధ్యప్రదేశ్‌లో 7 సీట్లు, అస్సాంలో 5, బిహార్‌లో 5, ఛత్తీస్‌గఢ్‌లో 3, పశ్చిమబెంగాల్‌లో 3, మణిపూర్, త్రిపుర, జమ్మూకశ్మీర్‌లలో చెరొక నియోజకవర్గానికి పోలింగ్ జరిగింది.  

త్రిపురలో అత్యధికంగా 79.6శాతం పోలింగ్ నమోదైంది. ఉత్తరప్రదేశ్‌లో అత్యల్పంగా 54.8శాతం నమోదైంది. మణిపూర్‌లో 77.3శాతం పోలింగ్ జరిగింది. చాలారాష్ట్రాల్లో పోలింగ్ 2019 కంటె తక్కువగా జరగడం గమనార్హం. మధ్యప్రదేశ్‌లో ఈ దశలో పోలింగ్ జరిగిన స్థానాల్లో గతంతో పోలిస్తే దాదాపు 9శాతం పోలింగ్ తగ్గింది.

కేరళలో పోలింగ్ గతంతో పోలిస్తే 7.5శాతం తగ్గింది. ఆ రాష్ట్రంలోని మొత్తం 20 స్థానాలకూ జరిగిన ఎన్నికల్లో 70.3 శాతం పోలింగ్‌ నమోదయింది. 2019 ఎన్నికల్లో అది 77.8శాతం.

బిహార్‌లోని 5 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 55.7శాతం మాత్రమే పోలింగ్ నమోదయింది. 2019తో పోలిస్తే అది 7శాతం కంటె ఎక్కువ తగ్గింది.

ఛత్తీస్‌గఢ్‌లో మూడు నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో 73.05శాతం పోలింగ్‌ నమోదయింది. ఈ గణాంకాలు మరికొంచెం పెరిగే అవకాశముంది.

కర్ణాటక రాజధాని బెంగళూరులో పోలింగ్ దాదాపు 50శాతం మాత్రమే ఉండడం గమనార్హం. కర్ణాటకలో మొత్తం 28 స్థానాలకు గాను 14 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. వాటన్నింటినీ కలుపుకుంటే 69.23శాతం పోలింగ్ నమోదయింది.

అయితే రాజధాని బెంగళూరులోని మూడు నియోజకవర్గాల్లో మాత్రం పరిస్థితి వేరేలా ఉంది. బెంగళూరు సెంట్రల్, బెంగళూరు ఉత్తర, బెంగళూరు దక్షిణ... ఈ మూడు నియోజకవర్గాల్లోనూ తక్కువ పోలింగ్ నమోదయింది.

బెంగళూరు సెంట్రల్‌లో 52.81శాతం పోలింగ్ నమోదైంది. బెంగళూరు ఉత్తర నియోజకవర్గంలో 54.42శాతం మాత్రమే పోలింగ్ జరిగింది. అలాగే బెంగళూరు దక్షిణంలో 53.15శాతం ఉత్తీర్ణత నమోదైంది.  

తుది గణాంకాల్లో కొద్దిపాటి మార్పుచేర్పులు ఉండవచ్చు.

google-add
google-add
google-add

ముఖ్యాంశాలు

బద్వేలు- 2024 ఎవరిది...?

T Ramesh | 13:19 PM, Thu May 09, 2024

Badi Baat

google-add

వీడియోలు

తేజస్‌లో మోదీ

P Phaneendra | 15:40 PM, Sat Nov 25, 2023
google-add
google-add