Saturday, May 04, 2024

Logo
Loading...
google-add

ఎస్ కోటలో సీటు సింగారించేదెవరో?

P Phaneendra | 17:23 PM, Tue Apr 23, 2024

Srungavarapu Kota Assembly Constituency Profile

శృంగవరపుకోట అసెంబ్లీ  నియోజకవర్గం భౌగోళికంగా విజయనగరం జిల్లాలో ఉంది. కానీ ఈ శాసనసభా స్థానం విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. 1951లో ఏర్పడిన ఎస్‌ కోట నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉన్నాయి. అవి శృంగవరపు కోట, లక్కవరపు కోట, కొత్తవలస, వేపాడ, జామి.

ఎస్‌ కోటలో 1953లో టంగుటూరి ప్రకాశం పంతులుగారు ప్రజా సోషలిస్టు పార్టీ తరఫున ఏకగ్రీవంగా గెలవడం ఒక రికార్డు. అక్కడ 1960 వరకూ కాంగ్రెస్ ఉనికే లేదు. 1962లో కూడా కాంగ్రెస్ గెలిచినా 1967లో స్వతంత్ర అభ్యర్ధికి దారిచ్చింది. 1972, 1978లో మళ్ళీ కాంగ్రెస్ విజయాలు సాధించింది. 1983లో రంగప్రవేశం చేసిన తెలుగుదేశం హవా 2014 వరకూ కొనసాగింది. మధ్యలో ఒక్కసారి 2004లో కాంగ్రెస్ అభ్యర్ధి విజయం సాధించగలిగారు.

2009, 2014లో రెండుసార్లు వరుసగా గెలిచిన తెలుగుదేశం అభ్యర్ధి కోళ్ళ లలితకుమారికి 2019లో వైఎస్ఆర్‌సిపి అభ్యర్ధి కడుబండి శ్రీనివాసరావు చెక్ పెట్టారు.

ఇప్పుడు 2024లో వైఎస్ఆర్‌సిపి సిట్టింగ్ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావునే మోహరించింది. అటు ఎన్‌డిఎ కూటమి తరఫున తెలుగుదేశం అభ్యర్ధిగా కోళ్ళ లలితకుమారి మరోసారి బరిలోకి దిగారు.ఇండీ కూటమి తమ అభ్యర్ధిని ఇంకా ప్రకటించలేదు.ఇప్పుడు ఎవరు పైచేయి సాధిస్తారన్నది ఆసక్తికరంగా నిలిచింది.

google-add
google-add
google-add

ముఖ్యాంశాలు

Badi Baat

google-add

అంతర్జాతీయం

google-add
google-add