Monday, April 29, 2024

Logo
Loading...
google-add

బిల్ గేట్స్ తో ప్రధాని మోదీ ‘డిజిటల్’ చర్చ

T Ramesh | 10:57 AM, Fri Mar 29, 2024

భారత ప్రధాని మోదీ, టెక్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ మధ్య చాయ్ పే చర్చాలో పలు కీలక విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. విద్య, వ్యవసాయం సహా పలు రంగాల్లో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు.  కృత్రిమ మేధతో కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని బిల్‌గేట్స్‌  అన్నారు. సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి ఇష్టపడతానని తెలిపిన మోదీ, కొత్త విషయాలను తెలుసుకోవడానికి చాలా ఉత్సుకత చూపుతానన్నారు. వీరిద్దరి మద్య  ఈ  ఉదయం ‘చాయ్ పే చర్చా’ జరిగింది. 

భారత్ అధ్యక్షతన జరిగిన జీ20 సదస్సులో ఏఐ టెక్నాలజీని వినియోగించిన విషయాన్ని మోదీ గుర్తు చేశారు. తన  హిందీ ప్రసంగాన్ని తమిళంలోకి ఏఐ సాయంతో అనువదించామని బిల్ గేట్స్ కు తెలిపారు.  ఏఐ శక్తిమంతమైనదే. కానీ.. దానిని దుర్వినియోగం చేసే ప్రమాదం ఉంది. తప్పుడు వ్యక్తుల చేతుల్లో పడితే చేటు చేస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా తన డీప్‌ఫేక్‌ ఘటనను వివరించారు.

ఏఐ వినియోగంలో  ప్రారంభ దశలో ఉన్నామన్న బిల్ గేట్స్, కష్టమైన పనులు తేలికగా చేస్తూ సులువైన విషయాల్లో విఫలమవుతుందన్నారు. నమో యాప్‌లో ఏఐ వినియోగం గురించి గేట్స్‌కు ప్రధాని మోదీ అవగాహన కల్పించారు. ఈ యాప్‌ ద్వారా సెల్ఫీ తీసుకుంటే అందులో ఉన్న ముఖాన్ని గుర్తించి ఆ వ్యక్తి పాత ఫొటోలను రిట్రీవ్‌ చేస్తుందని వివరించారు. సెల్ఫీ దిగిన తర్వాత గతంలో వీరిద్దరూ దిగిన పలు ఫొటోలు డిస్ ప్లే అయ్యాయి.

భారత్‌ డిజిటల్ రంగంలో చాలా మార్పులు వచ్చాయన్న మోదీ  నమో డ్రోన్‌ దీదీ పథకం గురించి ప్రస్తావించారు. మహిళలు పైలట్లుగా, డ్రోన్లు ఆపరేట్‌ చేసే స్థాయికి ఎదిగారని కొనియాడారు.  చిరు ధాన్యాలతో అధిక ప్రయోజనం కలుగుతుంది. తక్కువ నీటితో ఎరువులు లేకుండా వీటిని సాగు చేయవచ్చు అని తెలిపారు.

google-add
google-add
google-add

ముఖ్యాంశాలు

Badi Baat

google-add

అంతర్జాతీయం

google-add
google-add

రాజకీయం

google-add
google-add