Saturday, May 04, 2024

Logo
Loading...
google-add

నర్సీపట్నంలో అధికార విపక్షాల మధ్య హోరాహోరీ

P Phaneendra | 21:56 PM, Wed Apr 24, 2024

Narsipatnam Assembly Constituency Profile

అనకాపల్లి జిల్లాలో ఒకే ఒక మేజర్ ప్రాజెక్టు తాండవ రిజర్వాయర్ ఉన్న నియోజకవర్గం నర్సీపట్నం. ఈ నియోజకవర్గం 1955లో ఏర్పాటయింది. నర్సీపట్నం అసెంబ్లీ స్థానంలో నాలుగు మండలాలు ఉన్నాయి. అవి నాతవరం, గొలుగొండ, నర్సీపట్నం, మాకవరపాలెం.

మొదట్లో కాంగ్రెస్ ఆధిక్యం ఉన్న నర్సీపట్నంలో క్రమంగా తెలుగుదేశం జెండా పాతింది. ఆ పరిస్థితి గత ఎన్నికల్లో మారి వైఎస్ఆర్‌సిపి గెలిచింది. రాబోయే ఎన్నికల్లో టిడిపి తన ఆధిక్యం నిలబెట్టుకుంటుందా లేక వైసీపీ రెండోసారీ జెండా ఎగరేస్తుందా అన్నది చూడాలి.

నర్సీపట్నం నియోజకవర్గంలో 1955లో కాంగ్రెస్ గెలిచింది. 1962లో ఒకసారి స్వతంత్ర పార్టీ గెలిచింది, ఆ తర్వాత వరుసగా మూడుసార్లు అంటే 1967, 1972, 1978లో కాంగ్రెస్ హవా కొనసాగింది. 1983, 1985లో తెలుగుదేశం అభ్యర్ధిగా చింతకాయల అయ్యన్నపాత్రుడు గెలిచాడు. 1989లోనూ, 2009లోనూ కాంగ్రెస్ వారే గెలిచారు. 1994, 1996, 1999, 2004, 2014 ఇలా తెలుగుదేశం గెలిచిన ప్రతీసారీ ఆ పోటీలో నీదే గెలుపు.

2009లో కాంగ్రెస్ అభ్యర్ధి బోలెం ముత్యాల పాప, తెలుగుదేశం ప్రత్యర్థి చింతకాయల అయ్యన్నపాత్రుడు పోటీపడగా కాంగ్రెసే విజయం సాధించింది. 2014లో అయ్యన్న ప్రాత్యుడు వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్ధి పెట్ల ఉమాశంకర్ గణేష్ మీద 2338 ఓట్ల తేడాతో గెలిచారు. 2019లో వారే అభ్యర్ధులు, ఫలితాలే తారుమారయ్యాయి. పెట్ల ఉమాశంకర్ గణేష్ అయ్యన్నపాత్రుడిపై సుమారు 24వేల ఓట్ల తేడాతో గెలిచారు.

2024లో మళ్ళీ పాత ప్రత్యర్ధులే పోటీ పడుతున్నారు. అధికార వైఎస్ఆర్‌సిపి తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్, తెలుగుదేశం తరఫున  ఇండీ కూటమి తరఫున తెలుగుదేశం అభ్యర్ధి రుత్తల శ్రీరామమూర్తి కూడా పోటీలో ఉన్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే పెట్ల ఉమాశంకర్ గణేష్, ప్రముఖ సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ సోదరుడే.

google-add
google-add
google-add

ముఖ్యాంశాలు

Badi Baat

google-add

అంతర్జాతీయం

google-add
google-add

రాజకీయం

google-add
google-add