Saturday, May 04, 2024

Logo
Loading...
google-add

మాడుగుల హల్వా ఎవరికి తీపి?

P Phaneendra | 15:52 PM, Wed Apr 24, 2024

Madugula Assembly Constituency Profile

మాడుగుల హల్వా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఫేమస్. ఆ నియోజకవర్గం తెలుగుదేశం పుట్టినప్పటి నుంచీ ఆ దాదాపుగా పార్టీకే తీపి తినిపిస్తోంది. మరి ఈసారి ఏమవుతుంది?

మాడుగుల నియోజకవర్గం పరిధిలో నాలుగు మండలాలున్నాయి. అవి మాడుగుల, చీడికాడ, దేవరాపల్లి, కె కోటపాడు.  ఈ శాసనసభా స్థానం 1951లో ఏర్పడింది.

మాడుగుల నియోజకవర్గంలో కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపలేదు. 1952 నుంచి నేటివరకూ కేవలం 3సార్లు మాత్రమే గెలవగలిగింది. 1952లో కృషికార్ లోక్‌పార్టీ, 1955లో ప్రజా సోషలిస్టు పార్టీ విజయం సాధించాయి. 1962లో స్వతంత్ర అభ్యర్ధిగా తెన్నేటి విశ్వనాథం గారు గెలిచారు. 1967లో కాంగ్రెస్ అభ్యర్ధి ఆర్ దేవి, 1972లో అదే పార్టీకి చెందిన బొడ్డు కళావతి గెలిచారు. 1978లో స్వతంత్ర అభ్యర్ధి విజయం సాధించారు. ఇంక అక్కడినుంచీ తెలుగుదేశం హవా మొదలైంది. 1983, 1985, 1989, 1994, 1999 సంవత్సరాల్లో సైకిల్ జోరుగా దూసుకుపోయింది. 2004లో కాంగ్రెస్ తరఫున కరణం ధర్మశ్రీ గెలిచారు. 2019లో టిడిపి మళ్ళీ ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక 2014, 2019ల్లో వైఎస్ఆర్‌సిపి తరఫున బూడి ముత్యాలనాయుడు, తెలుగుదేశం నుంచి గవిరెడ్డి రామానాయుడు పోటీ పడ్డారు. రెండుసార్లూ వైసీపీయే గెలిచింది. కానీ 2024లో ఇరుపక్షాలూ తమ అభ్యర్ధులను మార్చేసాయి.

రాబోయే ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్‌సిపి తరఫున ఈర్లె అనూరాధ బరిలో ఉన్నారు. ఎన్‌డిఎ కూటమి నుంచి టిడిపి తరఫున బండారు సత్యనారాయణమూర్తి పోటీలో ఉన్నారు. ఇండీ కూటమి నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా బీబీఎస్ శ్రీనివాసరావు తలపడుతున్నారు.

google-add
google-add
google-add

ముఖ్యాంశాలు

Badi Baat

google-add

అంతర్జాతీయం

google-add
google-add

రాజకీయం

google-add
google-add