Friday, May 03, 2024

Logo
Loading...
google-add

ఆ పాము పొడవు 50 అడుగులు, టన్ను బరువు, పరిశోధనలో ఏం తేలిందంటే..?

T Ramesh | 15:08 PM, Fri Apr 19, 2024

గుజరాత్ లో 2005లో లభ్యమైన ఓ పాము వెన్నెముక శిలాజానికి సంబంధించిన పరిశోధనల్లో కీలక పురోగతి లభించింది. భూమ్మీద ఇప్పటివరకు జీవించిన అతిపెద్ద పాముకు సంబంధించిన అవశేషామని తేల్చారు. ఆ పాము టీ రెక్స్ కన్నా పొడవైనదన్నారు.

గుజరాత్ లోని కచ్ ప్రాంతంలో  2005లో గుర్తించిన పాము శిలాజానికి  శాస్త్రవేత్తలు వాసుకి ఇండికస్ గా పేరుపెట్టారు. తాజా పరిశోధనల్లో అదే అతిపెద్ద పాము అని తేల్చారు. పాము శిలాజానికి చెందిన కొన్న భాగాలు భారీ కొండ చిలువను పోలి ఉన్నాయని  అవి విషపూరితం కానివి అయి ఉండవచ్చు అని శాస్త్రవేత్తలు భావించారు. పాము పొడవు సుమారు 50 అడుగులు కాగా బరువు టన్ను ఉంటుందని లెక్కలేశారు. పరిశోధన వివరాలను ‘స్ప్రింగర్ నేచర్’ లో సైంటిఫిక్ రిపోర్ట్స్ పేరిట  ప్రచురించారు.

ఆకారాన్ని బట్టి వాసుకి నెమ్మదిగా కదులుతుందని, మాటు వేసి దాడి చేసే జీవి అని పరిశోధకులు చెబుతున్నారు. కొండచిలువలా వాసుకి కూడా తాను దాడి చేసిన జీవిని ఊపిరాడకుండా చేసి మింగుతుందంటున్నారు.  ఈ పాము గుజరాత్ తీర ప్రాంతంలోని చిత్తడి నేలల్లో జీవించేదని ఈ పరిశోధనకు సారథ్యం వహించిన ప్రధాన రచయిత, ఐఐటీ రూర్కీ పోస్ట్ డాక్టోరల్ రీసెర్చర్ (పేలియెంటాలజీ) దెబాజిత్ దత్తా ఓ వార్తాసంస్థకు వివరించారు. నాగదేవతల రాజుగా పిలవబడే  వాసుకి పేరును ఈ పాము శిలాజానికి పెట్టారు.

సుమారు ఆరు కోట్ల సంవత్సరాల కిందట  కొలంబియా ప్రాంతంలో టైటనోబోవా అనే భారీ పాము జీవించేది. అది సుమారు 43 అడుగుల పొడవుతో ఒక టన్నుకన్నా ఎక్కువ బరువు ఉండేదని పరిశోధకుల అంచనా. టైటనోబోవాకన్నా వాసుకి ఆకారంలో పెద్దదా లేక సన్నదా అనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేమని ఐఐటీ రూర్కీ ప్రొఫెసర్, ఈ పరిశోధన పత్రాల సహ రచయిత సునీల్ బాజ్ పాయ్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం జీవిస్తున్న అతిపెద్ద పాము ఆసియాకు చెందిన రెటికులేటెడ్ పైథాన్. దీని పొడవు 33 అడుగులు.

google-add
google-add
google-add

ముఖ్యాంశాలు

Badi Baat

google-add

వీడియోలు

తేజస్‌లో మోదీ

P Phaneendra | 15:40 PM, Sat Nov 25, 2023
google-add
google-add