Sunday, May 05, 2024

Logo
Loading...
google-add

ముగిసిన నామినేషన్ల సందడి: పులివెందులలో సీఎం జగన్...

T Ramesh | 16:00 PM, Thu Apr 25, 2024

తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల సమర్పణకు గడువు ముగిసింది. నేడు(ఏప్రిల్ 25) చివరి రోజు కావడంతో భారీగా నిమినేషన్లు దాఖలయ్యాయి. శుక్రవారం(ఏప్రిల్ 26) నామినేషన్లు పరిశీలించనున్నారు.  నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 29 వరకు గడువు ఉంది.

ఆంధప్రదేశ్ లో 25 లోక్ సభ స్థానాలతో పాటు 175 శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా, తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ శాసనసభ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఆంధ్రప్రదేశ్ లో  175 అసెంబ్లీ స్థానాలకు 4210 నామినేషన్లు దాఖలు కాగా,  25 లోక్‌సభ స్థానాలకు 731 నామినేషన్లు  సమర్పించారు. నేడు పలువురు ప్రముఖులు నామినేషన్లు దాఖలు చేశారు.

పులివెందుల అసెంబ్లీ స్థానానికి  వైసీపీ అభ్యర్థి సీఎం జగన్ నామినేషన్ వేశారు. తొలుత పులివెందులలోని సీఎస్ఐ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న సీఎం అక్కడ్నుంచి నేరుగా రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి వెళ్ళి నామినేషన్ వేశారు. నామినేషన్ పత్రాలను పులివెందుల ఆర్వో కు అందజేశారు.  

అంతకుముందు పులివెందులలో నిర్వహించిన  బహిరంగ సభలో మాట్లాడిన సీఎం జగన్, వివేకానందరెడ్డి హత్య విషయాన్ని ప్రస్తావించారు. తన చినాన్న వివేకానందరెడ్డిని  ఎవరు హత్య చేశారో బయటి ప్రపంచానికి తెలుసన్నారు. వారితోనే తన చెల్లెళ్ళు జతకట్టారని విమర్శించారు. అవినాశ్ ఏ తప్పూ చేయలేదు కాబట్టే మళ్ళీ టికెట్ ఇచ్చానని చెప్పుకొచ్చారు. చంద్రబాబు అండ్ కో కూటమి తనపై దుష్ర్పచారం చేస్తుందన్నారు.

google-add
google-add
google-add

Badi Baat

లేటెస్ట్ అప్‌డేట్

google-add

వీడియోలు

తేజస్‌లో మోదీ

P Phaneendra | 15:40 PM, Sat Nov 25, 2023
google-add
google-add