Sunday, May 05, 2024

Logo
Loading...
google-add

కాకినాడ రూరల్‌లో హవా ఎవరిది?

P Phaneendra | 18:22 PM, Thu Apr 25, 2024

Kakinada Rural Assembly Constituency Profile

కాకినాడ రూరల్ శాసనసభా నియోజకవర్గం 2008లో ఏర్పడింది. ఆ నియోజకవర్గం పరిధిలో మూడు మండలాలు ఉన్నాయి. అవి కాకినాడ అర్బన్ మండలంలోని నాలుగు వార్డులు, కాకినాడ రూరల్ మండలం, కరప.

1955లో పల్లపాలెం ద్విసభ్య నియోజకవర్గం ఉండేది. 1962లో దాని స్థానంలో కరప, తాళ్ళరేవు నియోజకవర్గాలు  ఏర్పడ్డాయి. ఆ టెర్మ్ పూర్తయాక కరప నియోజకవర్గం రద్దయి తాళ్ళరేవు మిగిలింది. 2004 వరకూ ఉన్న తాళ్ళరేవు స్థానం 2008 నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణలో రద్దయింది.

1955 నుంచి 1972 వరకూ కాంగ్రెస్ అభ్యర్ధులే గెలిచారు. 1978లో జనతాపార్టీ గెలిచింది. 1983 నుంచి 1999 వరకూ తెలుగుదేశం తరఫున సి రామచంద్రరావు వరుసగా గెలుస్తూ వచ్చారు. 2004లో కాంగ్రెస్ విజయం సాధించింది. 2009లో కాకినాడ రూరల్‌ నియోజకవర్గంగా మారిన తర్వాత మొదటిసారి జరిగిన ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున కురసాల కన్నబాబు గెలిచారు. రాష్ట్ర విభజన అనంతరం తొలిసారి జరిగిన 2014 ఎన్నికల్లో తెలుగుదేశం విజయం సాధించింది. 2019లో వైఎస్ఆర్‌సిపి తరఫున కన్నబాబు మరోసారి గెలిచారు.

ఇప్పుడు 2024లో అధికార వైఎస్ఆర్‌సిపి తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పోటీ చేస్తున్నారు. ఎన్‌డిఎ కూటమి పక్షాన జనసేన అభ్యర్ధిగా పంతం వెంకటేశ్వరరావు (నానాజీ) బరిలో నిలిచారు. ఇండీ కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్ధిగా పిల్లి సత్యలక్ష్మి బరిలోకి దిగారు.

google-add
google-add
google-add

Badi Baat

లేటెస్ట్ అప్‌డేట్

google-add

వీడియోలు

తేజస్‌లో మోదీ

P Phaneendra | 15:40 PM, Sat Nov 25, 2023
google-add
google-add