Sunday, May 05, 2024

Logo
Loading...
google-add

ఆంధ్రా పేపర్ మిల్ లాకౌట్

T Ramesh | 15:15 PM, Thu Apr 25, 2024

ఎంతో చరిత్ర కలిగిన రాజమహేంద్రవరం ఆంధ్ర పేపర్ మిల్ లాకౌట్ ప్రకటించింది. లాకౌట్ ను అధికారికంగా ప్రకటించిన  యాజమాన్యం మిల్లు ప్రాంగణం గేట్లకు తాళాలు వేసింది. లాకౌట్ ప్రకటించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న కార్మికుల గేటు వద్దే ఆందోళనకు దిగారు. దీంతో ఆంద్రా పేపర్ మిల్ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

మరోవైపు ఏప్రిల్ 2 నుంచి పేపర్ మిల్ కార్మికులు సమ్మెలో ఉన్నారు. కొత్త వేతన ఒప్పందం అమలు చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.  ఆంధ్ర పేపర్ మిల్ ఏడాదికి రూ. 200 కోట్ల నికరలాభంలో ఉన్నప్పటికీ 2,500 మంది కార్మికుల వేతన ఒప్పందాల విషయంలో  నిర్లక్ష్యగా వ్యవహరిస్తున్నారంటూ ఆందోళనకు దిగారు. వేతనాల విషయంలో యాజమాన్యం, కార్మికుల మధ్య వివాదం నడుస్తుండగానే,  మిల్ యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. మిల్ మెయిన్ గేటు వద్ద భారీగా  పోలీసులు మోహరించారు.

ఇటీవల సీఎం జగన్, తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు కూడా కార్మికులు వినతిపత్రం అందజేశారు. తమ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కోరారు.

google-add
google-add
google-add

Badi Baat

లేటెస్ట్ అప్‌డేట్

google-add

వీడియోలు

తేజస్‌లో మోదీ

P Phaneendra | 15:40 PM, Sat Nov 25, 2023
google-add
google-add