కరోనా మహమ్మారి ఇంకా భయపెడుతూనే ఉంది. కోవిడ్-19 వైరస్ అనేక విధాలుగా రూపాంతరం చెందుతూనే ఉంది. వేరియంట్లు, సబ్ వేరియంట్లుగా పలుదేశాలకు వ్యాపిస్తోంది. తాజాగా మరో కొత్త వేరియంట్ 27 దేశాలకు పాకడం కలకలం సృష్టిస్తోంది.
ఈ వేరియంట్ ను ఎక్స్ఈసీగా పిలుస్తున్నారు. ఈ రకాన్ని మొట్టమొదట జర్మనీలో గుర్తించారు. బ్రిటన్, నెదర్లాండ్స్, డెన్మార్క్ దేశాల్లో ఈ కొత్త వేరియంట్ పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి.
కరోనా వైరస్ లోని ఇతర రకాలతో పోల్చితే ఎక్స్ఈసీ వేరియంట్ వ్యాప్తి చెందే వేగం తక్కువ అని పరిశోధనలో తేలింది. చలికాలంలో దీని ప్రభావం అధికమని ఒమిక్రాన్ వేరియంట్ పరంపరలోనిదే కాబట్టి, వ్యాక్సిన్ తో నివారించవచ్చు అని తెలుస్తోంది.