పాస్పోర్ట్ సేవలకు ఐదురోజుల పాటు అంతరాయం ఏర్పడింది. పోర్టల్ మెయింటనెన్స్ కారణంగా ఈ సమస్య తలెత్తింది. ఇప్పటికే బుక్ చేసుకున్న అపాయింట్ మెంట్లను రీషెడ్యూల్ చేస్తామని విదేశాంగ శాఖ పేర్కొంది.
రీషెడ్యూల్ చేసిన వివరాలను ఆయా అభ్యర్థులకు వ్యక్తిగతంగా సమాచారం అందిస్తామని వివరించింది. గురువారం (ఆగస్టు 29) రాత్రి 8 గంటల నుంచి ఆన్లైన్ పాస్ పోర్ట్ సేవలు బంద్ అవుతాయి. సెప్టెంబర్ 2 వరకు కొత్త అపాయింట్మెంట్లు బుక్ చేసుకోవడం వీలుకాదు. కొత్తగా పాస్ పోర్ట్ తీసుకోవడానికి, పాత పాస్ పోర్ట్ రెన్యూవల్ సహా ఇతర సేవలు పొందేందుకు అపాయింట్ మెంట్ బుక్ చేసుకోవడానికి ఈ ఆన్ లైన్ సేవా పోర్టల్ ఉపయోగపడుతుంది.