జనగణనకు రంగం సిద్దమైంది. ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జరగాల్సిన జనగణన 2021లో కోవిడ్ కారణంగా వాయిదా పడింది. ఇక జనగణనతోపాటు కులగణన కూడా చేస్తారా? లేదా? అనేది తేలాల్సి ఉంది. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ల అమలుకు కులగణన తప్పనిసరి. ఇక పలు రాష్ట్రాలు స్వయంగా కులగణన చేపడుతున్నాయి. అయితే తాజాగా జరిపే జనగణనలో కులగణనకు సంబంధించిన ప్రశ్నలు ఇంకా చేర్చలేదని తెలుస్తోంది.
మొదటి సారిగా మన దేశంలో డిజిటల్ పద్దతిలోనూ కుల జనగణన చేపట్టబోతున్నారు. ఇందు కోసం ఓ పోర్టర్ రూపొందించారు. ఇప్పటికే 31 ప్రశ్నలు తయారు చేశారు. సెల్ ఫోన్, బైక్, కారు ఉన్నాయా లేదా అనే విషయాలను కూడా జనగణన ద్వారా సేకరించకున్నారు. జనభా పెరుగుదల రేటు ఏ రాష్ట్రంలో ఎంత ఉంది. దేశంలో ప్రస్తుతం జనాభా ఎంత ఉంది అనే విషయాలు కూడా జనగణన ద్వారా స్పష్టంగా తేలిపోనుంది.