దేశ సైనిక చరిత్రలో కొత్త ఘటన చోటుచేసుకుంది. తొలిసారి ఇద్దరు సహవిద్యార్థులు ఆర్మీ, నేవీ ఛీఫ్లయ్యారు. ఆర్మీ చీఫ్గా జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆదివారం బాధ్యతలు స్వీకరించగా ఈ ఏడాది మే 1న నావికాదళపతిగా అడ్మిరల్ దినేష్ త్రిపాఠి బాధ్యతలు చేపట్టారు. ఉపేంద్ర ద్వివేది, దినేష్ త్రిపాఠి క్లాస్మేట్స్.
మధ్యప్రదేశ్లోని సైనిక్ స్కూల్ రేవాలో ఇద్దరు కలిసి చదువుకున్నారు. 1970లో 5వ తరగతిలో చేరిన ఉపేంద్ర ద్వివేది, దినేష్ త్రిపాఠి 12వ తరగతి వరకు కలిసి విద్యాభసం చేశారు. స్కూల్ లో వారి రోల్ నంబర్లు 931,938 గా ఉండేవి.
ఆర్మీ, నేవీ అధిపతులు ఒకే పాఠశాలకు చెందిన వారని రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి భరత్ భూషణ్ బాబు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. భారత సైనిక చరిత్రలో మొదటిసారి ఈ సంఘటన చోటుచేసుకుందన్నారు.
మధ్యప్రదేశ్లోని సైనిక్ స్కూల్ రేవాలో క్లాస్మేట్స్ అయిన జనరల్ ఉపేంద్ర ద్వివేది, అడ్మిరల్ దినేష్ త్రిపాఠి 50 ఏళ్ళతరువాత ఆర్మీ, నేవీకి నాయకత్వం వహించే స్థాయికి ఎదిగారని కీర్తించారు. ఇద్దరు అద్భుతమైన విద్యార్థులు ఈ స్థాయికి చేర్చిన అరుదైన గౌరవం రేవా సైనిక్ స్కూల్కు దక్కుతుందని ప్రశంసించారు.