ఆధార్- రేషన్ కార్డ్‌ను లింక్ గడువును కేంద్రప్రభుత్వం మరోసారి పొడిగించింది. 2024 జూన్ 30తో గడువు ముగియనుండగా, సెప్టెంబర్ 30 వరకు పెంచినట్లు కేంద్రప్రభుత్వం తెలిపింది.రేషన్ కార్డులు దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు రేషన్ కార్డుకు ఆధార్ లింక్ చేయాలని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.
సమీపంలోని రేషన్ షాప్ లేదా కామన్ సర్వీస్ సెంటర్ ను సందర్శించి లింక్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ కాపీలతో పాటు బయోమెట్రిక్ వెరిఫికేషన్‌తో అనుసంధానం పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ పోర్టల్ ద్వారా అనుసంధానం చేసే అవకాశం కూడా ఉంది.
రాష్ట్ర పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పోర్టల్‌ను సందర్శించి ‘link Aadhaar with the active ration card’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ నంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టాలి. ఆ తర్వాత ఓటీపీని ఎంటర్ చేయడంతో ఆధార్ అనుసంధానం పూర్తవుతుంది.