భారత ఆర్మీ కొత్త చీఫ్ గా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీని నియమిస్తూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్మీ అధినేత మనోజ్ సి. పాండే ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. మనోజ్ స్థానంలో ఉపేంద్ర ద్వివేదీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ద్వివేదీ ప్రస్తుతం ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్‌గా ఉన్నారు.
1964లో జన్మించిన ద్వివేదీ 20 ఏళ్ళ వయస్సుకే అంటే 1984లో జమ్మూకశ్మీర్ రైఫిల్స్‌లో చేరారు. ఆర్మీలో 40 ఏళ్ళు వివిధ సర్వీసుల్లో సేవలందించారు. కశ్మీర్ లోయ, రాజస్థాన్ సెక్టార్‌లోని వివిద విభాగాల్లో పనిచేశారు. అస్సాం రైఫిల్స్ ఐజీగా బాధ్యతలు నిర్వర్తించారు.
రేవా సైనిక్ స్కూల్ లో పాఠశాల విద్య పూర్తి చేశారు. నేషనల్ డిఫెన్స్ కాలేజీ, యూఎస్ ఆర్మీ వార్ కళాశాలలో గ్రాడ్యూయేషన్ పూర్తి చేశారు. స్ట్రాటజిక్ స్టడీస్, మిలిటరీ స్టడీస్‌లో రెండు మాస్టర్ డిగ్రీలు పొందారు. తదనంతరం డిఫెన్స్, మేనేజ్మెంట్ స్టడీస్ లో ఎంఫిల్ చేశారు.