Boy locks leopard that entered into house
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా మాలెగావ్
పట్టణంలో విజయ్అనే 12 ఏళ్ళబాలుడు సమయస్ఫూర్తి తో వ్యవహరించి ఏకంగా చిరుతపులినే ఇంట్లో
బంధించాడు.
ఇంట్లో ముందుగదిలో టేబుల్ మీద కూర్చుని
మొబైల్పోనులో ఆడుకొంటున్న మోహిత్… ఓ చిరుతపులి మెల్లగా తమ ఇంట్లోకి ప్రవేశించడం
చూసాడు. ఏమాత్రం చప్పుడు చేయకుండా లేచిన బాలుడు వీధిలోకి వచ్చి తలుపు గడియ
పెట్టేశాడు. తర్వాత మోహిత్ ఈ విషయం తల్లి దండ్రులకు చెప్పాడు. వారు స్థానిక అటవీశాఖ
అధికారులకు
సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న
అటవీ సిబ్బంది చిరుతపులికి మత్తుమందు ఇచ్చారు. అనంతరం దానిని సురక్షితప్రాంతానికి
తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డు
కావడంతో వైరల్గా మారాయి.