తిరుమల సప్తగిరులపై హిందూయేతర గుర్తులను తీసుకురావాలని మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చూశారని కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి శోభకరందాజే ఆరోపించారు. తిరుమల కళాశాలల్లో పద్మావతి శ్రీనివాసుల స్వామి వారి ఫోటోలు కూడా తొలగించారని గుర్తుచేశారు. తిరుమల స్వామి వారి లడ్డూల తయారీలో చేప నూనె, పంది కొవ్వు కలిపి అపచారం చేశారని, స్వామి మమ్మల్ని క్షమించు అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు వ్యవహారంపై విచారణ జరపాల్సిన అవసరముందని కేంద్ర ఆహార మంత్రి ప్రహ్లాద్ జోషి అభిప్రాయపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పిన తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు వ్యవహారం చాలా తీవ్రమైందని, దోషులను కఠినంగా శిక్షించాల్సిన అవసరముందంటూ జాతీయ మీడియాకు చెప్పారు.
తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగిస్తోన్న ఆవునెయ్యిలో చేపనూనె, జంతువుల కొవ్వు కలిపారని గుజరాత్‌లోని నేషనల్ డైరీ డెవలప్మెంట్ ల్యాబులో జరిపిన పరీక్షల్లో తేలింది. దీంతో దేశ వ్యాప్తంగా తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.