NIA conducts raids
అసాంఘికశక్తుల
ఆటకట్టించే చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) పలు చోట్ల సోదాలు నిర్వహిస్తోంది.
దేశవ్యాప్తంగా 32 ప్రాంతాల్లో ఏకకాలంటో NIA సిబ్బంది
తనిఖీలు చేస్తున్నారు. ఉగ్రవాదులు, మాఫియా ముఠా నేతలు, డ్రగ్స్ స్మగ్లర్లే లక్ష్యంగా
దిల్లీ, హర్యానా, పంజాబ్ లో దాడులు కొనసాగుతున్నాయి.
రాష్ట్ర పోలీసులతో కలిసి
తెల్లవారు జామునుంచే అనుమానాస్పద వ్యక్తుల ఇళ్ళలో ఈ తనిఖీలు జరుగుతున్నాయి.
మూసేవాలే
హత్యకు సంబంధించి హర్యానాలోని సోనిపట్, ఝజ్జర్ సహా మరికొన్ని ప్రాంతాల్లో గ్యాంగ్‌స్టర్
లారెన్స్ బిష్ణోయ్‌తో సన్నిహిత సంబంధాలున్న వారిని ప్రశ్నిస్తున్నారు.
గ్యాంగ్
స్టర్ బిష్ణోయ్ అతని సహచరులపై ఉపా చట్టం -2022 కింద కేసు నమోదు చేసిన ఎన్ఐఏ, జనవరి
6న అతడికి సంబంధించిన ఆస్తులను అటాచ్ చేసింది.
బిష్ణోయ్
గ్యాంగ్ దేశవ్యాప్తంగా పలు చోట్ల నేరాలకు పాల్పడినట్లు దర్యాప్తు లో తేలింది. సంచలనం
రేపిన పలు హత్యల్లోనూ వీరి పాత్ర ఉన్నట్లుగా నిర్ధారణ అయింది. ప్రఖ్యాత పంజాబ్
గాయకుడు సిధూ మూసేవాలా, మతగురువు ప్రదీప్ కుమార్ హత్య వెనుక ఈ గ్యాంగ్ హస్తముండటంతో పాటు పలువురు
వ్యాపార ప్రముఖులను బెదిరించి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసినట్లు కూడా తేలింది.
పాకిస్తాన్, కెనడా కేంద్రంగా ఉంటూ ఇక్కడ
నేరాలకు పాల్పడుతున్నారని విచారణలో
స్పష్టమైంది.
గ్యాంగ్స్టార్ల
నెట్వర్క్ మొత్తాన్ని తుదిముట్టించే ఉద్దేశంతో వారికి సంబంధించిన ఆస్తులను కూడా
ఎన్ఐఏ సీజ్ చేసింది.