సంచలనం
రేపిన కాకతీయ మెడికల్ కళాశాల(KMC)
పీజీ విద్యార్థిని ధరావత్ బలవన్మరణం కేసు మళ్ళీ చర్చనీయాంశంగా మారింది. కేసులో
నిందితుడు సైఫ్ పై వచ్చిన ఆరోపణలు
నిజమేనని ర్యాగింగ్ నిరోధక కమిటీ తేల్చింది. దీంతో అతడిపై విధించిన సస్పెన్షన్
కాలాన్ని మరో 97 రోజులు పెంచింది. సస్పెన్షన్ కాలం మార్చి 3తో ముగియనుండగా జూన్ 8 వరకు పొడిగించింది.
కేఎంసీలో
మొదటి ఏడాది పీజీ చదివే ధరావత్ ప్రీతి, సీనియర్ విద్యార్థి సైఫ్ వేధిస్తున్నాడంటూ తల్లిదండ్రులు,
సహా విద్యార్థులు, కాలేజీ యాజమాన్యం దగ్గర ఆవేదన చెందింది. అయినా వేధింపులు
ఆగలేదంటూ గత ఏడాది ఫిబ్రవరి 22న బలవన్మరణానికి యత్నించింది. విషం ఇంజక్షన్
చేసుకోవడంతో అదే నెల 26న ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆరోపణలు ఎదుర్కొన్న సైఫ్ ను
పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు.
ప్రీతి
ఆత్మహత్య ఘటనలో నిందితుడిగా ఉన్న సైఫ్ పై ఏడాది పై సస్పెన్షన్ వేటు పడింది. అయితే
అతడు హైకోర్టు ఆశ్రయించడంతో తాత్కాలికంగా
శిక్షను రద్దు చేశారు. నవంబర్ 9న హైకోర్టు ఆదేశాల మేరకు మళ్ళీ సమావేశమైన ర్యాగింగ్
నిరోధక కమిటీ, అతడిపై వచ్చిన ఆరోపణలు నిజమేనని నిర్ధారించింది. ఇదే విషయాన్ని
హైకోర్టుకు నివేదించారు. దీంతో కోర్టు ఆదేశాలకు అనుగుణంగా మళ్ళీ చర్యలు
తీసుకున్నారు.
అనంతరం
బెయిల్ పై విడుదల అయ్యారు. కానీ ఏడాది పాటు తరగతులకు హాజరుకాకుండా కేఎంసీ ర్యాగింగ్
నిరోధక కమిటీ చర్యలు తీసుకుంది. దీనిపై సైఫ్, హైకోర్టును ఆశ్రయించారు.
తాను జైలులో
ఉన్నప్పుడే ర్యాగింగ్ నిరోధక కమిటీ నిర్ణయం తీసుకుందని విచారణలో తన అభిప్రాయాన్ని
పరిగణించలేదని కోర్టుకు తెలిపారు.
దీంతో
కోర్టు ఆదేశాల మేరకు సస్పెన్షన్ ను తాత్కాలికంగా రద్దు చేసి మళ్ళీ విచారించారు. కమిటీ
సభ్యుల ముందు విచారణకు హాజరైన సైఫ్ , ప్రీతి ఆత్మహత్య ఘటనలో అభియోగాల గురించి వివరణ
ఇచ్చారు.
ర్యాగింగ్
నిజమేనని నిర్ధారించి కోర్టుకు కమిటీ నివేదిక అందజేసింది. న్యాయస్థానం సూచనలు
మేరకు విధులకు హాజరైన 97 రోజుల కాలాన్ని సైతం కలిపి 2024 జూన్ 8 వరకు సస్పెన్షన్
కాలాన్ని పొడిగించారు.