INS Chennai rushing towards distressed vessel
భారతీయ
నేవీ సిబ్బందితో వెళుతున్న కార్గో షిప్( MV LILA NORFOLK) ను సోమాలియా తీరంలో సాయుధుల గుంపు హైజాక్ చేసింది. లైబీరియన్
జెండాతో వెళుతున్న ఈ నౌకలో 15 మంది భారతీయులు ఉన్నట్లు భారత నావికాదళం పేర్కొంది.
హైజాక్
సమాచారం అందుకున్న భారత నేవీ తక్షణమే స్పందించింది. తీరప్రాంత పహారా ఎయిర్ క్రాఫ్ట్
లను రంగంలోకి దించడంతో పాటు యుద్ధనౌకను కూడా సంఘటనా స్థలానికి పంపుతోంది. తమకు సమాచారం అందిన వెంటనే స్పందించామని పరిణామాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు భారత
నావికాదళం వివరించింది.
హైజాక్ అయిన నౌక సమీపంలోకి వెళ్ళిన ఎయిర్ క్రాఫ్ట్
పరిస్థితిని అంచనా వేసింది. నౌకలోని సిబ్బందితో కమ్యూనికేషన్ సోర్స్ కూడా
దొరికినట్లు తెలిపిన ఇండియన్ నేవీ, ఐదు
నుంచి ఆరుగురు సాయుధులు ఈ చర్యకు
పాల్పడినట్లు అంచనా వేస్తోంది.
సోమాలియా
తీరంలో వాణిజ్య నౌకలను హైజాక్ చేస్తోన్న సముద్ర దొంగలు, యాజమాన్యం నుంచి డబ్బులు
దండుకుని వాటిని వదిలిపెడుతున్నాయి. మల్టీ నేషనల్ మారిటైమ్ టాస్క్ఫోర్స్ , సముద్ర దొంగల దాడులను ఆరికట్టడంలో
కీలకంగా వ్యవహరిస్తోంది.