Case filed
against Bairi Naresh
నాస్తికనేత
బైరి నరేశ్ పై ములుగు జిల్లా ఏటూరు నాగారం లో కేసు నమోదైంది. అయ్యప్ప భక్తుడిని
కారుతో ఢీకొట్టినట్లు ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు
చేస్తున్నారు.
నాస్తిక
సంఘం ఆధ్వర్యంలో ఏటూరి నాగారం లో జరిగిన ఓ
సమావేశంలో పాల్గొన్న బైరి నరేశ్‌ను అయ్యప్ప భక్తులు, శివస్వాములు చుట్టుముట్టారు. అయ్యప్ప
స్వామి పై చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్
చేశారు. హిందూ మతంపై ఎందుకు అవాకులు చవాకులు పేలుతున్నారని ప్రశ్నించారు. సనాతన
మతంతో పాటు తమ ఆరాధ్యదైవాలపై ఎందుకు అభ్యంతరక వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు
కించపరచడం సరికాదని హితవు పలికారు. మరోసారి దేవుళ్ళ గురించి చులకనగా మాట్లాడితే
ఊరుకునేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతో
వారికి సమాధానం చెప్పలేకపోయిన నరేశ్ అక్కడి
నుంచి జారుకున్నాడు. ఈ క్రమంలో నరేశ్ , తన కారుతో ఓ అయ్యప్ప భక్తుడిని ఢీకొట్టినట్లు
ఫోలీసులకు ఫిర్యాదు అందింది. నరేశ్ తన కారుతో గుద్దడంతో తనకు గాయాలైనట్లు సదరు
ఫిర్యాదు దారుడు పేర్కొన్నాడు.
గతంలో
హిందూమతాచారాలు, అయ్యప్ప స్వామి పుట్టుకపై బైరి నరేశ్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.
అయ్యప్ప మాలధారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేయగా 45 రోజుల పాటు జైలు లో ఉన్నారు.
అంతకు ముందు జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా బైరి నరేశ్ హిందూ మతంపై వివాదాస్పద
వ్యాఖ్యలు చేస్తున్నారు. సోషల్ మీడియా సహా పలు సమావేశాల్లోనూ ఆయన సనాతన ధర్మం, భక్తి పై ఇష్టానుసారం
మాట్లాడుతున్నారు. దీనిపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నరేశ్ కు
వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు.