Security
Forces Attacked By Militants In Manipur:
మణిపూర్లో
మరోసారి హింస చెలరేగింది. కొన్ని రోజులుగా నెలకొన్న ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టి
హింసకు పాల్పడ్డారు. మిలిటెంట్లు జరిపిన ఆకస్మిక దాడిలో నలుగురు పోలీసు కమాండోలతో
పాటు, సరిహద్దు భద్రతా దళానికి(BSF)
చెందిన ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.
మయన్మార్ సరిహద్దులోని మోరే నగరంలో
ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
తీవ్రంగా
గాయపడిన జవాన్లను చికిత్స నిమిత్తం వాయుమార్గంలో ఇంఫాల్ కు తరలించారు.
ఆంగ్ల
సంవ్సతరాది రోజు తౌబాల్ జిల్లాలో సాయుధ మిలిటెంట్లు, స్థానికుల మధ్య జరిగిన వివాదం
జరిగింది. ఈ గొడవలో నలుగురు పౌరులను మిలిటెంట్లు
పొట్టనబెట్టుకున్నారు. దీంతో
ఐదు
జిల్లాలో కర్ఫ్యూ విధించిన పోలీసులు, గస్తీ ముమ్మరం చేశారు.
తౌబాల్
ఘటనను ఖండించిన ముఖ్యమంత్రి బీరేన్ సింగ్, నిందితులను పట్టుకుని శిక్షిస్తామని ఓ
వీడియో సందేశంలో తెలిపారు. అమాయకుల ప్రాణాలు తీస్తే చూస్తూ ఊరుకోమన్నారు.
నిందితులు ఎంతటి వారైనా తగిన శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరించారు. ప్రజలు సంయమనం
పాటించి శాంతియుత వాతావరణానికి సాయపడాలని కోరారు.
మళ్ళీ
హింస చెలరేగడంతో తౌబాల్, తూర్పు ఇంపాల్, పశ్చిమ ఇంఫాల్, కాక్చింగ్, బిష్ణుపూ జిల్లాల్లో
కర్ఫ్యూ విధించారు. గతం వారం మోరే లో
జరిగిన కాల్పుల్లో నలుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు.