Terrorist Dawood Ibrahim’s home,
properties will be auctioned
ఉగ్రవాది,
ముంబై వరుస పేలుళ్ళ సూత్రధారి దావూద్ ఇబ్రహీం, చిన్ననాటి ఇల్లు, వ్యవసాయభూమి సహా
పలు ఆస్తుల వేలం జరగనుంది. మహారాష్ట్రలోని రత్నగిరి పరిధిలో ఉన్న ఈ ఆస్తులను జనవరి
5న అధికారులు వేలం వేయబోతున్నారు. ముంబేక్
గ్రామంలోని వ్యవసాయ భూములు కూడా జప్తు జాబితాలో ఉన్నాయి.
అక్రమ
రవాణా, విదేశీ మారక ద్రవ్య నిరోధక(ఆస్తుల జప్తు SAFEMA) చట్టం కింద ఈ ఆస్తులను గతంలోనే సీజ్ చేసిన అదికారులు దఫాల వారీగా వేలం
వేస్తున్నారు.
గడిచిన
9 ఏళ్ళలో దావూద్ కుటుంబానికి చెందిన 11 రకాల ఆస్తులు జప్తు చేశారు. అందులో
రెస్టారెంట్, ఆరు ఫ్లాట్లు, ఓ విశ్రాంత భవనం ఉన్నాయి. రెస్టారెంట్ విలువ రూ. 4.53
కోట్లు కాగా, ఆరు ఫ్లాట్ల ఖరీదు రూ. 3.53 కోట్లు, గెస్ట్ హౌస్ రూ. 3.52 కోట్లు
పలికింది.
ముంబైలో
1993 మార్చి 12న వరుస పేలుళ్ళ ఘటనలో దావూద్ ఇబ్రహీం ప్రధాన దోషి. ఘటన తర్వత అతడు
విదేశాలకు పారిపోయాడు. పేలుళ్ళ ఘటనలో 257 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 700
మంది గాయపడ్డారు. రూ. 27 కోట్ల విలువైన ఆస్తులు ధ్వంసమయ్యాయి.
రత్నగిరి తాలూకాలోని
ముంబాకే గ్రామంలో నివసించిన దావూద్ కుటుంబం, 1983లో ముంబై వచ్చి స్థిరపడింది.
మహారాష్ట్ర ప్రభుత్వ వినతి మేరకు ఈ కేసును సెంట్రల్
బ్యూరో ఆఫ్ ఇన్విస్టేగేషన్(CBI)
దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో దోషులుగా తేలిన ముస్తఫా దోస్సా, అబూ సలేమ్ కు
కోర్టు శిక్ష విధించింది.